Sunil Gavaskar Coments: ఆ సమయంలో ఆస్ట్రేలియన్లు నన్ను తీవ్రంగా రెచ్చగొట్టారు.. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది..

| Edited By: Pardhasaradhi Peri

Jan 02, 2021 | 10:25 AM

Sunil Gavaskar Coments: ఇండియన్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఒక

Sunil Gavaskar Coments: ఆ సమయంలో ఆస్ట్రేలియన్లు నన్ను తీవ్రంగా రెచ్చగొట్టారు.. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది..
Follow us on

Sunil Gavaskar Coments: ఇండియన్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఒక అనుభవాన్ని గురించి స్పందించాడు. 1981 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించిందన్నాడు. ఆ ఘటనలో ఆస్ట్రేలియా క్రికెటర్లు తనను తీవ్రంగా రెచ్చగొట్టారని కానీ ఆ మ్యాచ్‌లోభారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.

1981 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్‌ డెనిస్‌ లిల్లీ బౌలింగ్‌లో గావస్కర్‌ను ఎల్బీగా అంపైర్‌ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై తాను తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. బంతి ప్యాడ్‌కు తగలకుముందే బ్యాట్‌కు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుందని, కానీ అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడని అన్నాడు. అయితే తాను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న క్రమంలో ఆస్ట్రేలియన్లు రెచ్చగొట్టారని, గెట్ లాస్ట్ అన్నారని తెలిపాడు. దీంతో తాను, మరో బ్యాట్స్‌మెన్ చేతన్‌ ఇద్దరం కలిసి మైదానాన్ని వీడామని తెలిపాడు.

అయితే తనతో పాటు మైదానాన్ని వీడాలని చెప్పడంతో చేతన్‌ చౌహన్ షాకయ్యాడని గావస్కర్‌ అన్నాడు. నిజంగానే అంటున్నావా అని అడిగాడని పేర్కొన్నాడు. అయితే అంతకుముందు రోజు ఆటలో జరిగిన ఓ సంఘటనతో తన మైండ్‌లో ఈ ఆలోచన వచ్చిందని చెప్పాడు. అంతకుముందు రోజు ఆటలో అలెన్ బోర్డర్‌ ఔట్‌గా మూడు సార్లు అప్పీల్‌ చేశాం. అంపైర్‌, స్క్వేర్‌లెగ్ అంపైర్‌.. ఔటా? నాటౌటా? అని చర్చించారు. ఆ సమయంలో వికెట్‌కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి ఈ సారి కూడా ఔట్ ఇవ్వకపోతే తాను మైదానాన్ని విడిచి వెళ్లిపోతా అని అన్నాడు. దీంతో తర్వాత రోజు నేను ఔటైనప్పుడు మైదానాన్ని విడిచిపోవాలి అనే ఆలోచన వచ్చిందని వివరించాడు.