ప్రపంచకప్‌లో లంక కెప్టెన్ అరుదైన ఘనత

|

Jun 02, 2019 | 1:07 PM

ప్రపంచకప్‌లో శ్రీలంక నూతన సారధి దిముత్ కరుణరత్నే అరుదైన రికార్డు నమోదు చేశాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణరత్నే(52 నాటౌట్) ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఓ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి కడవరకూ క్రీజ్‌లో నిలిచిన రెండో ఆటగాడిగా కరుణరత్నే చరిత్ర సృష్టించాడు. లంక వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటికీ కరుణరత్నే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో శ్రీలంక 136 పరుగులు చేయగలిగింది. ఇకపోతే కరుణరత్నే కన్నా ముందు వెస్టిండీస్ క్రికెటర్ రిడ్లీ […]

ప్రపంచకప్‌లో లంక కెప్టెన్ అరుదైన ఘనత
Follow us on

ప్రపంచకప్‌లో శ్రీలంక నూతన సారధి దిముత్ కరుణరత్నే అరుదైన రికార్డు నమోదు చేశాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణరత్నే(52 నాటౌట్) ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఓ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి కడవరకూ క్రీజ్‌లో నిలిచిన రెండో ఆటగాడిగా కరుణరత్నే చరిత్ర సృష్టించాడు. లంక వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటికీ కరుణరత్నే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో శ్రీలంక 136 పరుగులు చేయగలిగింది.

ఇకపోతే కరుణరత్నే కన్నా ముందు వెస్టిండీస్ క్రికెటర్ రిడ్లీ జాకబ్స్ ఈ ఘనత సాధించాడు. 1999 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జాకబ్స్ ఈ ఘనత సాధిస్తే.. దాదాపు 20 ఏళ్ళ తర్వాత కరుణరత్నే అతని సరసన నిలిచాడు. ఆనాటి మ్యాచ్‌లో జాకబ్స్ 49 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీకి దూరమవగా.. కరుణరత్నే మాత్రం హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.