ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: 19 ఓవర్లకు శ్రీలంక 84/6

| Edited By:

Jun 01, 2019 | 4:36 PM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ తన పదునైన బంతులతో చెలరేగిపోతున్నాడు. తొలి ఓవర్‌ రెండో బంతికి లంక ఓపెనర్‌ లహిరు తిరుమన్నే(4)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపిన హెన్రీ.. తొమ్మిదో ఓవర్‌లో మరో రెండు వికెట్లు సాధించి శ్రీలంకకు షాకిచ్చాడు. తొమ్మిదో ఓవర్‌ మొదటి బంతికి కుశాల్‌ పెరీరా(29) ఔట్‌ చేసిన హెన్రీ.. ఆ మరుసటి బంతికి కుశాల్‌ మెండిస్‌ను పెవిలియన్‌ బాట పట్టించాడు. మెండిస్‌ తాను ఎదుర్కొన్న తొలి […]

ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: 19 ఓవర్లకు శ్రీలంక 84/6
Follow us on

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ తన పదునైన బంతులతో చెలరేగిపోతున్నాడు. తొలి ఓవర్‌ రెండో బంతికి లంక ఓపెనర్‌ లహిరు తిరుమన్నే(4)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపిన హెన్రీ.. తొమ్మిదో ఓవర్‌లో మరో రెండు వికెట్లు సాధించి శ్రీలంకకు షాకిచ్చాడు. తొమ్మిదో ఓవర్‌ మొదటి బంతికి కుశాల్‌ పెరీరా(29) ఔట్‌ చేసిన హెన్రీ.. ఆ మరుసటి బంతికి కుశాల్‌ మెండిస్‌ను పెవిలియన్‌ బాట పట్టించాడు. మెండిస్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. హెన్రీ దెబ్బకు శ్రీలంక 84 పరుగులకే 6 వికెట్లు
కోల్పోయి కష్టాల్లో పడింది.