Shubhman Gill : అరంగేట్రం ముందు రాత్రి అలా చేశా.. ఫలితంగా నిద్రమాత్రతో సరిపెట్టుకున్నానంటున్న ఇండియన్ ప్లేయర్..

|

Jan 29, 2021 | 5:40 AM

Shubhman Gill Coments: ఆస్ట్రేలియాతో అడిలైట్‌లో జరిగిన టెస్ట్‌లో భారత్ 36 పరుగులకు ఆలౌటైన సంగతి గురించి టీం ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shubhman Gill : అరంగేట్రం ముందు రాత్రి అలా చేశా.. ఫలితంగా నిద్రమాత్రతో సరిపెట్టుకున్నానంటున్న ఇండియన్ ప్లేయర్..
Follow us on

Shubhman Gill Coments: ఆస్ట్రేలియాతో అడిలైట్‌లో జరిగిన టెస్ట్‌లో భారత్ 36 పరుగులకు ఆలౌటైన సంగతి గురించి టీం ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో ఆటగాళ్లకు ఎలా స్పందించాలో తెలియలేదన్నాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌కి ముందురోజు రాత్రి తనకు నిద్ర సరిగా పట్టలేదని ఫలితంగా నిద్రమాత్ర వేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు.

టీమ్‌ఇండియా 36కు ఆలౌటైనప్పుడు తామంతా షాకయ్యామని, అత్యంత వేగంగా కుప్పకూలడంతో ఎలా స్పందించాలో తెలియలేదన్నాడు. దానిని జీర్ణించుకునేందుకు మాకు సమయం కూడా దొరకలేదన్నాడు. మీడియాలో ది గ్రేట్‌ అడిలైడ్‌ కొలాప్స్‌ అనే వాక్యాలు చదివినప్పుడు బాధేసిందని చెప్పుకొచ్చాడు. అయితే మెల్‌బోర్న్‌లో అరంగేట్రం చేస్తానని అడిలైడ్‌ మ్యాచుకు ముందే తెలుసని పేర్కొన్నాడు. ఉదయం మేం తొలుత ఫీల్డింగ్‌ చేయాల్సి వచ్చిందని, జట్టంతా మైదానంలో ఉండటంతో నాకు అరంగేట్రం చేస్తున్న అనుభూతి కూడా కలగలేదని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ అదరగొట్టగా ఆ తర్వాత బ్రిస్బేన్‌లో త్రుటిలో శతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

ఆ ఆటగాన్ని తక్కువ అంచనా వేస్తున్నారన్న మాజీ టీమిండియా ఆటగాడు.. ఎంతో విలువైన ఆటగాడని కితాబు…