టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

|

May 08, 2019 | 7:51 PM

విశాఖ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు విశాఖనగరం ఆతిథ్యమిస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తేమ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఛేచింగ్ ఈజీ అవుతుందని స్పోర్ట్స్ ఎనలిస్ట్స్ భావిస్తున్నారు. ఏసీఏ స్టేడియం గతంలో హైదరాబాద్‌కు రెండో సొంత మైదానంగా ఉండేది. ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు మూడింటిలో నెగ్గి రెండింటిలో ఓడింది. ఈ […]

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
Follow us on

విశాఖ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు విశాఖనగరం ఆతిథ్యమిస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తేమ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఛేచింగ్ ఈజీ అవుతుందని స్పోర్ట్స్ ఎనలిస్ట్స్ భావిస్తున్నారు. ఏసీఏ స్టేడియం గతంలో హైదరాబాద్‌కు రెండో సొంత మైదానంగా ఉండేది. ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు మూడింటిలో నెగ్గి రెండింటిలో ఓడింది. ఈ మైదానం స్వల్ప స్కోర్లకు పెట్టింది పేరు. 2013 నుంచి టీ20లతోపాటు ఐపీఎల్‌లో ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 146. ఢిల్లీలో కొలిన్‌ ఇంగ్రామ్‌ స్థానంలో కొలిన్‌ మన్రోను తీసుకున్నారు.