Video: 5.4 ఓవర్లు.. ఒక మెయిడీన్‌తో 7 వికెట్లు.. తొలి మ్యాచ్‌లోనే రికార్డుల బెండ్ తీసిన బౌలర్.. ఎవరంటే?

|

Jul 23, 2024 | 9:01 AM

Charlie Cassell: చార్లీ కాసెల్ తీసిన 7 వికెట్లలో, మొదటి రెండు వికెట్లు వేసిన తొలి ఓవర్ మొదటి రెండు బంతుల్లోనే వచ్చాయి. దీంతో పాటు తాను వేసిన తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా చార్లీ రికార్డు సృష్టించాడు.

Video: 5.4 ఓవర్లు.. ఒక మెయిడీన్‌తో 7 వికెట్లు.. తొలి మ్యాచ్‌లోనే రికార్డుల బెండ్ తీసిన బౌలర్.. ఎవరంటే?
Sco Vs Omn Scotland's Charlie Cassell
Follow us on

SCO vs OMN Scotland’s Charlie Cassell Breaks ODI Record: స్కాట్లాండ్‌లోని ఫోర్థిల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఓమన్, స్కాట్లాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. అయితే, స్కాట్లాండ్ తరపున అరంగేట్రం చేస్తున్న యువ పేసర్ చార్లీ క్యాజిల్.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఏ బౌలర్ చేయలేని రికార్డు సృష్టించాడు. అరంగేట్రం మ్యాచ్‌లో 5.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన చార్లీ ఒక మెయిడిన్ ఓవర్‌తో సహా 21 పరుగులు మాత్రమే ఇచ్చి వరుసగా 7 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చార్లీ కాజిల్‌కు ముందు ప్రపంచంలో ఏ బౌలర్ కూడా తన అరంగేట్రం మ్యాచ్‌లో ఇన్ని వికెట్లు తీయలేకపోయాడు.

బద్దలైన రబాడ రికార్డ్..

చార్లీ కంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ పేరిట ఉంది. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో రబాడ తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కేవలం 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో స్కాట్లాండ్‌కు చెందిన చార్లీ క్యాజిల్ విజయం సాధించింది.

7 వికెట్లు పడగొట్టిన చార్లీ..


ఇది కాకుండా చార్లీ క్యాజిల్ తీసిన ఏడు వికెట్లలో తొలి రెండు వికెట్లు అతడు వేసిన తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే వచ్చినవే కావడం గమనార్హం. దీంతో పాటు తాను వేసిన తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా చార్లీ రికార్డు సృష్టించాడు. అరంగేట్రం మ్యాచ్‌లో తొలి ఓవర్‌ తొలి బంతికే వికెట్‌ తీసిన 32వ బౌలర్‌గా కూడా నిలిచాడు. చార్లీ క్యాజిల్ కంటే ముందు ప్రపంచంలోని 31 మంది బౌలర్లు ఈ ఘనత సాధించారు.

దీంతో పాటు తొలి ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు తీసిన చార్లీ.. అదే ఓవర్‌లో మరో వికెట్ కూడా పడగొట్టాడు. దానికి తోడు ఈ ఓవర్ కూడా మెయిడిన్ కావడం విశేషం. దీంతో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చార్లీ నిలిచాడు. నిజానికి అంతకుముందు ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో చార్లీ క్యాజిల్‌ను జట్టులో ఎంపిక చేయలేదు. కానీ, జట్టులో ఎంపికైన మరో స్పీడ్ స్టర్ క్రిస్ సోల్ గాయపడడంతో చార్లీ క్యాజిల్ జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చార్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మ్యాచ్ పరిస్థితి ఎలా ఉందంటే..

ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. చార్లీ క్యాజిల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఓమన్ జట్టు 50 ఓవర్లు పూర్తిగా ఆడలేక కేవలం 21.4 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన స్కాట్లాండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..