Rohit Sharma : సిడ్నీలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. మూడో టెస్టుకు అందుబాటులో హిట్‌మ్యాన్

|

Dec 30, 2020 | 6:48 PM

ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ తిరిగి టీమ్ తో..

Rohit Sharma : సిడ్నీలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. మూడో టెస్టుకు అందుబాటులో హిట్‌మ్యాన్
Follow us on

Rohit Sharma return : ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ తిరిగి టీమ్ తో కలవనున్నాడు. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు ఆరంభంకానుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. తాజాగా 14 రోజుల తర్వాత రోహిత్ శర్మ సిడ్నీలో అడుగు పెట్టాడు. సిడ్నీలోని హోటల్ లో ఉన్న తన సహచరులను రోహిత్ కలిసాడు. మూడో టెస్టులో రోహిత్ ‌ఆడతాడని ఇప్పటికే టీమిండియా కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇప్పుడు రోహిత్ సిడ్నీలో అడుగు పెట్టడంతో మూడో టెస్ట్ లో రోహిత్ ఆడటం కన్ఫామ్ గా కనిపిస్తుంది. మరో వైపు భారత్ చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా తమ లోపాల్ని సరిదిద్దుకునే పనిలో పడింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన ఓపెనర్‌ జో బర్న్స్‌ను జట్టు నుంచి తొలగించింది.