IND Vs WI: భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత.. పదేళ్ల తర్వాత మళ్లీ అదే సీన్

IND Vs WI: భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ముగిసిపోయింది.. కానీ ఈ మూడు మ్యాచ్‌ల్లో నమోదైన రికార్డులు మాత్రం ఇప్పట్లో మరిచిపోయేలా లేవు. మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల వరద పారగా.. ఏకంగా 10 సెంచరీలు నమోదయ్యాయి. ఒక్క సిరీస్‌లో ఇంత భారీ స్థాయిలో సెంచరీలు నమోదవడం క్రికెట్ చరిత్రలోనే అరుదైన విషయంగా నిలిచింది.

IND Vs WI: భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత.. పదేళ్ల తర్వాత మళ్లీ అదే సీన్
Ind Vs Wi

Updated on: Oct 04, 2026 | 2:29 PM

IND Vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కొన్ని స్పెషల్ రికార్డుల ద్వారా క్రికెట్ చరిత్రలో నిలిచింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ కరేబియన్ జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ సిరీస్ మొత్తంలో బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ రెండు జట్లు 300 పరుగుల మైలురాయిని సులభంగా దాటాయి. ముఖ్యంగా రెండో వన్డేలో రెండు జట్లు కలిసి 800 పైగా పరుగులు సాధించడం విశేషం. భారత జట్టు వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ రన్ ఛేజింగ్‌ను నమోదు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది.

సెంచరీల మోత మోగించిన బ్యాటర్లు

ఈ సిరీస్‌లో ఇరు జట్ల బ్యాటర్లు మునుపెన్నడూ లేని విధంగా సెంచరీల మోత మోగించారు. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సరిగ్గా 10 సెంచరీలు నమోదు కావడం విశేషం. భారత జట్టు తరఫున శుభమన్ గిల్ 2 సెంచరీలు బాదగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తలా ఒక సెంచరీ సాధించారు. మరోవైపు వెస్టిండీస్ జట్టు తరఫున కెప్టెన్ షాయ్ హోప్ 2 సెంచరీలు బాదగా, జాన్ క్యాంప్‌బెల్, ఆమిర్ జాంగూ, జస్టిన్ గ్రీవ్స్ కూడా సెంచరీలు కొట్టారు. ఇలా ఏకైక వన్డే సిరీస్‌‌లో 10 సెంచరీలు నమోదు కావడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

పదేళ్ల క్రితం నాటి రికార్డు బ్రేక్

ఒక ద్విపక్ష వన్డే సిరీస్‌లో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు ఇప్పటివరకు 2016లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్ పేరున ఉంది. ఆ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం 11 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పుడు భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల చిన్న సిరీస్‌లోనే 10 సెంచరీలు నమోదు కావడం ద్వారా రెండో అతిపెద్ద రికార్డుగా నిలిచింది. 2013లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్‌లో 9 సెంచరీలు నమోదయ్యాయి. ఈ గణాంకాలను బట్టి ఈ సిరీస్ బ్యాటర్లకు ఎంతగా అనుకూలించిందో అర్థం చేసుకోవచ్చు.

ఉత్కంఠభరితంగా ముగిసిన ఆఖరి పోరు

శనివారం జరిగిన 3 అలాగే చివరి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అజేయంగా 162 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన వెస్టిండీస్ అద్భుత ప్రదర్శన కనబపరిచింది. భారత్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కరీబియన్ జట్టు విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్ చరిత్రలో లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా వెస్టిండీస్ సాధించిన అత్యధిక పరుగుల విజయంగా ఇది నిలిచింది. భారత జట్టు తరఫున కేఎల్ రాహుల్ అజేయంగా 129 పరుగులు చేయగా, రోహిత్ శర్మ (92), రుతురాజ్ గైక్వాడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us