ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: 17 ఓవర్లకు పాకిస్తాన్‌ 77/6

| Edited By:

May 31, 2019 | 4:33 PM

ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్ జట్టుతో తలపడుతున్న పాక్ 17 ఓవర్లలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు దించింది. పాక్ జట్టు 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇమామ్ ఉల్ హక్ (2), స్కోరు 35 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫకర్ జమాన్ (22), స్కోరు 45 పరుగులకు చేరాక హారిస్ సొహైల్ (8) అవుటయ్యారు. పాక్ […]

ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: 17 ఓవర్లకు పాకిస్తాన్‌ 77/6
Follow us on

ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్ జట్టుతో తలపడుతున్న పాక్ 17 ఓవర్లలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు దించింది. పాక్ జట్టు 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇమామ్ ఉల్ హక్ (2), స్కోరు 35 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫకర్ జమాన్ (22), స్కోరు 45 పరుగులకు చేరాక హారిస్ సొహైల్ (8) అవుటయ్యారు. పాక్ జట్టు కాస్త కుదురుకుంటోందనుకున్న తరుణంలో బాబర్ అజమ్ (22) పెవిలియన్ బాట పట్టాడు. ఫకర్ జమాన్ బౌల్డ్ కాగా, ఇంజమామ్, బాబర్, హారిస్ విండీస్ బౌలర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.