ధోనిలా స్టంపింగ్ చేయబోయి.. బోల్తాపడ్డాడు!

|

Jun 30, 2019 | 9:46 PM

లీడ్స్‌: వికెట్ కీపింగ్‌లో భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిది డిఫరెంట్ స్టైల్. వికెట్ల వంక చూడకుండానే ధోనికి రనౌట్ చేయగలిగిన సత్తా ఉంది. ఇక అతడి కీపింగ్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా అతడిలా కీపింగ్ చేయాలని ట్రై చేసి చాలామంది విఫలమయ్యారు. అందులో మన రిషబ్ పంత్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా చేరాడు. శనివారం లీడ్స్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో […]

ధోనిలా స్టంపింగ్ చేయబోయి.. బోల్తాపడ్డాడు!
Follow us on

లీడ్స్‌: వికెట్ కీపింగ్‌లో భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిది డిఫరెంట్ స్టైల్. వికెట్ల వంక చూడకుండానే ధోనికి రనౌట్ చేయగలిగిన సత్తా ఉంది. ఇక అతడి కీపింగ్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా అతడిలా కీపింగ్ చేయాలని ట్రై చేసి చాలామంది విఫలమయ్యారు. అందులో మన రిషబ్ పంత్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా చేరాడు.

శనివారం లీడ్స్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. అఫ్గాన్ ఇన్నింగ్స్ చివరి బంతికి ముజీబ్ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఫీల్డర్ బంతిని సర్ఫరాజ్‌కు అందించగా.. అతను ధోని మాదిరిగానే వికెట్లను చూడకుండా రనౌట్ చేసేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యాడు. దీంతో ముజీబ్ రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు.