Team India: ఒకే రోజు మూడు మ్యాచులు.. ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్

Team India: అక్టోబర్ 6న భారత క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. ఒకే రోజు మూడు భారత జట్లు వేర్వేరు ఫార్మాట్లలో బరిలోకి దిగనున్నాయి. లక్నోలో టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20, పాండిచ్చేరిలో ఇండియా A వర్సెస్ ఆస్ట్రేలియా A వన్డే, అహ్మదాబాద్‌లో భారత్ U19 వర్సెస్ ఆస్ట్రేలియా U19 టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Team India: ఒకే రోజు మూడు మ్యాచులు.. ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్
Team India

Updated on: Oct 06, 2026 | 7:00 AM

Team India: భారత క్రికెట్ అభిమానులకు మంగళవారం (అక్టోబర్ 6) నిజమైన పండుగ రోజే అని చెప్పవచ్చు. ఈ ఒక్క రోజే ఏకంగా మూడు వేర్వేరు భారత జట్లు వేర్వేరు ఫార్మాట్లలో ప్రత్యర్థులతో తలపడనున్నాయి. అందులో టి20, వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. మన సీనియర్ స్టార్ ప్లేయర్లు, టాలెంటెడ్ యంగ్ క్రికేటర్లు మైదానంలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ T20 సమరం

అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ లక్నోలోని ఏకానా స్టేడియంలో జరగనుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా, వెస్టిండీస్‌తో ఐదు టి20ల సిరీస్‌‌లో మొదటి పోరుకు సిద్ధమైంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లాంటి తుపాకీ హిట్టర్లు జట్టులో ఉన్నందున భారీ సిక్సర్ల వర్షం ఖాయంగా కనిపిస్తోంది.

టీ20 కోసం ఇరు జట్లు

భారత జట్టు: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్.

వెస్టిండీస్ జట్టు: షై హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), కమిల్ పూరన్, ఆమిర్ జాంగూ, షిమ్రోన్ హెట్మెయర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోవ్‌మన్ పావెల్, రోస్టన్ చేజ్, రొమారియో షెఫర్డ్, గుడాకేశ్ మోటి, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, మాథ్యూ ఫోర్డ్, కీమో పాల్, క్వింటన్ సాంప్సన్, షమర్ స్ప్రింగర్.

ఇండియా A వర్సెస్ ఆస్ట్రేలియా A

మరొకవైపు పాండిచ్చేరి వేదికగా ఇండియా A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య మూడు అనధికారిక వన్డేల సిరీస్ మొదలవుతోంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న భారత A జట్టులో రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ లాంటి ధనాధన్ బ్యాటర్లు ఉన్నారు. ఈ డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.

ఇరు జట్ల వివరాలు

భారత్ ఏ జట్టు: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పాటిదార్, నిశాంత్ సింధు, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, గుర్జప్నీత్ సింగ్, యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్, సూర్యాంశ్ షెడ్గే, కుమార్ కుశాగ్ర, విప్రజ్ నిగమ్.

ఆస్ట్రేలియా ఏ జట్టు: మిచెల్ ఓవెన్, సామ్ కాన్‌స్టాస్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), లియామ్ స్కాట్, నిఖిల్ చౌదరి, జాక్ ఎడ్వర్డ్స్, ఆరోన్ హార్డీ, బెన్ ద్వార్షియస్, మహ్లీ బీర్డ్‌మన్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, టాడ్ మర్ఫీ, లాచ్లాన్ షా, విల్ సదర్లాండ్.

ఇండియా U-19 వర్సెస్ ఆస్ట్రేలియా U-19

మూడో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. భారత అండర్-19 జట్టు, ఆస్ట్రేలియా అండర్-19తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. మొదటి రోజే మన బౌలర్లు కంగారూలను 174 పరుగులకే ఆలౌట్ చేసి అదరగొట్టారు. ఆట ముగిసే సమయానికి భారత్ 38/2 స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

టెస్ట్ మ్యాచ్ ఆడే ఇరు జట్లు

ఆస్ట్రేలియా అండర్-19 జట్టు: నీల్ పటేల్, హేడెన్ బార్బులోవిక్, మాథ్యూ లాగ్ (కెప్టెన్), జెడ్ హాలిక్, బ్లేక్ కేటల్, ఎలీ బ్రెన్, చార్లీ హెండర్సన్ (వికెట్ కీపర్), కేసీ బార్టన్, కానర్ గ్రెగరీ, స్పెన్సర్ గ్రీన్, థియో త్సింగోస్, విల్ బైరోమ్, జాక్ చోస్నెక్, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థామస్ వాసియో

భారత్ అండర్-19 జట్టు: లక్ష్య రాజేశ్ రాయ్‌చందానీ, సాగర్ విర్క్, కుశాగ్ర ఓజా, యశ్‌బర్ధన్ చౌహాన్ (కెప్టెన్), మనల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అయాన్ అక్రమ్, ఇషాన్ ఓమ్, మోహిత్ ఉల్వా, ప్రియాంశు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, రోహిత్ యాదవ్, అభిప్రాయ్ బిస్వాస్

క్రికెట్ అభిమానులకు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

ఉదయం నుంచి రాత్రి వరకు నాన్-స్టాప్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఉదయం కుర్రాళ్ల టెస్ట్ మ్యాచ్, మధ్యాహ్నం ఇండియా A వన్డే ఫైట్, రాత్రి సీనియర్ల టీ20 బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లతో అభిమానులకు వినోదం దొరకనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us