క్యాన్సర్‌ను జయించి 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 33 బంతుల్లో డకౌట్‌గా పెవిలియన్‌కు..!

Australia vs South Afric: క్యాన్సర్‌తో పోరాడి మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్ నిక్ మాడిన్సన్‌కు పునరాగమనం అనుకున్నంతగా సాగలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 33 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు.

క్యాన్సర్‌ను జయించి 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 33 బంతుల్లో డకౌట్‌గా పెవిలియన్‌కు..!
Nic Maddinson

Updated on: Oct 09, 2026 | 3:36 PM

Maddinson Test Return: ఆస్ట్రేలియా క్రికెట్‌లో నిక్ మాడిన్సన్ (Nic Maddinson) పునరాగమనం భావోద్వేగంతో కూడుకున్నది. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చిన ఈ ఎడమచేతి బ్యాటర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మైదానంలోకి వచ్చిన తర్వాత మాత్రం అతడి ఇన్నింగ్స్ నిరాశపరిచింది. డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన మాడిన్సన్ 33 బంతులు ఆడినా పరుగుల ఖాతా తెరవలేకపోయాడు.

దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) బౌలింగ్‌లో మాడిన్సన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఎంతో ప్రత్యేకంగా భావించిన అతడి టెస్ట్ పునరాగమనం డకౌట్‌తో ముగిసింది.

అసలు ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టులో మాడిన్సన్‌కు చోటే లేదు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis) వేలికి ఫ్రాక్చర్ కావడంతో జట్టులో మార్పు చేయాల్సి వచ్చింది. అతడి స్థానంలో బ్యాకప్‌గా మాడిన్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!

అనూహ్యంగా జట్టులోకి వచ్చిన మాడిన్సన్‌కు మరో కీలక బాధ్యత కూడా దక్కింది. సాధారణంగా మధ్యక్రమంలో బ్యాటింగ్ చేసే అతడిని ఈ మ్యాచ్‌లో నేరుగా ఓపెనర్‌గా పంపారు. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు మాత్రం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

మాడిన్సన్ పునరాగమనం వెనుక పెద్ద పోరాటమే ఉంది. 2024-25 సీజన్‌లో అతడికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ కఠిన పరిస్థితిని అధిగమించి మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన అతడు 2025 మార్చి తర్వాత ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ గతంలో అతడి షెఫీల్డ్ షీల్డ్ ప్రదర్శన ఆకట్టుకుంది. 2018 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య 52.37 సగటుతో పరుగులు సాధించాడు.

టెస్ట్ క్రికెట్‌లో మాడిన్సన్ చివరిసారి 2016లో ఆడాడు. అప్పట్లో ఆస్ట్రేలియా తరఫున మూడు టెస్టులు ఆడిన అతడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టు జెర్సీ ధరించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దక్షిణాఫ్రికాపైనే అతడి టెస్ట్ అరంగేట్రం జరిగింది. ఆ మ్యాచ్‌లోనే మ్యాథ్యూ రెన్‌షా (Matthew Renshaw) కూడా టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

ఎక్కువమంది చదివినది: నెట్స్‌లో బుడ్డోడి ఊచకోత.. తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..?

ఇప్పుడు అదే ప్రత్యర్థిపై పదేళ్ల తర్వాత మాడిన్సన్ మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడటం ప్రత్యేకంగా మారింది. అయితే తిరిగి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే డకౌట్ కావడం అతడి పునరాగమనానికి చేదు ఆరంభంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమిన్స్ (Pat Cummins) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, నిక్ మాడిన్సన్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాథ్యూ రెన్‌షా, అలెక్స్ క్యారీ, బ్యూ వెబ్‌స్టర్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హేజిల్‌వుడ్ తుది జట్టులో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us