ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: పది వికెట్ల తేడాతో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం

| Edited By:

Jun 01, 2019 | 7:38 PM

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ ఘనవిజయం సాధించింది. శ్రీలంక విధించిన 137 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేవీ నష్టపోకుండా చేధించి… అద్భుత విజయంతో టోర్నీ మొదలెట్టింది. మార్టిన్ గప్టిల్, మున్రో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు. గప్టిల్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేయగా…కోలిన్ మున్రో 47 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 58 పరుగులు చేశాడు. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక […]

ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: పది వికెట్ల తేడాతో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం
Follow us on

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ ఘనవిజయం సాధించింది. శ్రీలంక విధించిన 137 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేవీ నష్టపోకుండా చేధించి… అద్భుత విజయంతో టోర్నీ మొదలెట్టింది. మార్టిన్ గప్టిల్, మున్రో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు. గప్టిల్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేయగా…కోలిన్ మున్రో 47 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 58 పరుగులు చేశాడు. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 29.2 ఓవర్లలోనే 136 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రీలంక జట్టు… నిరాశజనిత ప్రదర్శనతోనే వరల్డ్‌కప్‌ 2019ను ఆరంభించింది. మ్యాట్ హెన్రీ, లూకీ ఫర్గూసన్‌లకు మూడేసి వికెట్లు దక్కగా, మిచెట్ సాంట్నర్‌, కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌, జేమ్స్ నిశమ్‌, ట్రెంట్ బౌల్ట్‌లకు తలా ఓ వికెట్ దక్కాయి.