అడిలైట్ ఓటమిని తట్టుకోలేకపోతున్న క్రికెట్ అభిమానులు.. కోచ్ రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు

|

Dec 20, 2020 | 5:52 AM

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో టీం ఇండియా ఘోరంగా ఓడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత తక్కు

అడిలైట్ ఓటమిని తట్టుకోలేకపోతున్న క్రికెట్ అభిమానులు.. కోచ్ రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు
Follow us on

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో టీం ఇండియా ఘోరంగా ఓడిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకోవడంతో భరించలేకపోతున్నారు. ఆటగాళ్లపై, కెప్టెన్సీపై, కోచ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అడిలైట్ వేదికగా జరిగిన గులాబి టెస్ట్‌లో భారత్ కేవలం 36 పరుగులకే కుప్పకూలిపోయి ఘోర అవమానాన్ని చవిచూసింది. రెండు రోజులు ఆసక్తిగా జరిగిన మ్యాచ్ మూడో రోజు ముచ్చటగా ముగిసింది.

మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాను 191పరుగులకే కట్టడిచేసింది. దీంతో ఇండియా ఘన విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. కేవలం 21.2 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలింది. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండెంకల స్కోర్ చేయలేదు. ఆస్ట్రేలియా బౌలర్స్ హేజిల్ వుడ్ 5 వికెట్లతో, కమిన్స్ 4 వికెట్లతో విజృంభించి భారత్‌ను గట్టి దెబ్బ తీశారు.దీంతో టీం ఇండియా చెత్త ప్రదర్శనకు కోచ్ రవిశాస్త్రి కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. అక్కడి పరిస్థితుల గురించి ఆటగాళ్లకు సరైన అవగాహన కల్పించడంలో ఆయన విఫలమయ్యారని దుమ్మెత్తిపోస్తున్నారు. వెంటనే ఆయనను కోచ్‌గా తొలిగించి మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ లాంటి వారిని కోచ్‌గా నియమించాలని కోరుతున్నారు. దయచేసి భారత క్రికెట్‌ను రక్షించండి అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని అభ్యర్థిస్తున్నారు. సోషల్‌మీడియా కేంద్రంగా పోస్ట్‌లు పెడుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.