పంజాబ్ జట్టు కో-ఓనర్‌కు జైలు శిక్ష

|

May 01, 2019 | 8:07 PM

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియాకు జైలు శిక్ష పడింది. 25 గ్రాముల డ్రగ్స్ కలిగి ఉన్న వాడియాను జపాన్‌లోని న్యూచిటోస్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ ఘటనలో సప్పోరో జిల్లా న్యాయస్థానం వాడియాకు శిక్ష విధించింది. తర్వాత ఆ శిక్షను ఐదు సంవత్సరాల వరకూ నిలుపుదల చేస్తూ మరో నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ శిక్ష వల్ల కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జట్టు యాజమాన్యం తెలిపింది. ఎందుకంటే […]

పంజాబ్ జట్టు కో-ఓనర్‌కు జైలు శిక్ష
Follow us on

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియాకు జైలు శిక్ష పడింది. 25 గ్రాముల డ్రగ్స్ కలిగి ఉన్న వాడియాను జపాన్‌లోని న్యూచిటోస్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ ఘటనలో సప్పోరో జిల్లా న్యాయస్థానం వాడియాకు శిక్ష విధించింది. తర్వాత ఆ శిక్షను ఐదు సంవత్సరాల వరకూ నిలుపుదల చేస్తూ మరో నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ శిక్ష వల్ల కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జట్టు యాజమాన్యం తెలిపింది. ఎందుకంటే కేసు వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగతం. జట్టుకు ఏమాత్రం సంబంధించింది కాదు. కాబట్టి, వ్యక్తిగత విషయాల్లో బీసీసీఐ జోక్యం చేసుకోబోదని పేర్కొంది.