ధోనినా..మజాకా! మరో రికార్డు అందుకున్న ‘తలా’

మాంచెస్టర్‌: భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. మాంచెస్టర్‌ వేదికగా మంగళవారం జరిగుతోన్న మ్యాచ్‌తో ధోనీ 350వ వన్డే ఆడతున్నాడు. క్రికెట్‌ గాడ్ సచిన్(463)తర్వాత 350 వన్డేలు ఆడిన భారత క్రికెటర్‌గా,  ప్రపంచవ్యాప్తంగా పదో క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ధోనీకన్నా ముందు మహేలా జయవర్ధనే(448), సనత్‌జయసూర్య(445), కుమార సంగక్కర(404), షాహిద్‌ అఫ్రిది(398), ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(378), రికీపాంటింగ్‌(375), వసీం అక్రమ్‌(356), ముత్తయ్యమురళీథరన్‌(350) వరుసగా ఈ జాబితాలో […]

ధోనినా..మజాకా! మరో రికార్డు అందుకున్న తలా

Updated on: Jul 09, 2019 | 3:17 PM

మాంచెస్టర్‌: భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. మాంచెస్టర్‌ వేదికగా మంగళవారం జరిగుతోన్న మ్యాచ్‌తో ధోనీ 350వ వన్డే ఆడతున్నాడు. క్రికెట్‌ గాడ్ సచిన్(463)తర్వాత 350 వన్డేలు ఆడిన భారత క్రికెటర్‌గా,  ప్రపంచవ్యాప్తంగా పదో క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ధోనీకన్నా ముందు మహేలా జయవర్ధనే(448), సనత్‌జయసూర్య(445), కుమార సంగక్కర(404), షాహిద్‌ అఫ్రిది(398), ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(378), రికీపాంటింగ్‌(375), వసీం అక్రమ్‌(356), ముత్తయ్యమురళీథరన్‌(350) వరుసగా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే 350 వన్డేలాడిన తొలి వికెట్‌కీపర్‌గానూ ధోనీ ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us