Video: రండిరా రండి..! బుడ్డోళ్లతో కొండముచ్చు క్రికెట్ ఆట.. వీడియో చూస్తే షాక్

Monkey On Cricket Field Viral Video: క్రికెట్ మైదానంలో ఆడుతున్న పిల్లలు కోతిని చూసి భయపడి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తడం మొదలుపెడతారు. కోతి కూడా పిల్లల వెంట పరిగెత్తి, చాలా మందిని తన్ని కిందపడేస్తుంది. కోతి కారణంగా పిల్లలు గాయపడ్డారు. పిల్లలు ఏడవడం కూడా చూడొచ్చు.

Video: రండిరా రండి..! బుడ్డోళ్లతో కొండముచ్చు క్రికెట్ ఆట.. వీడియో చూస్తే షాక్
Monkey Invaded The Field

Updated on: Aug 25, 2025 | 12:27 PM

Monkey On Cricket Field Viral Video: క్రికెట్ మ్యాచ్ సమయంలో మైదానంలోకి పాములు, పక్షులు, కుక్కలు అడ్డు రావడం ఇప్పటికే చూశాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. పిల్లలు అంతా కలిసి లోకల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న మైదానంలోకి అకస్మాత్తుగా ఓ కొండముచ్చు ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడున్న పిల్లలంతా భయంతో పరుగులు తీయడం వీడియోలో చూడొచ్చు. మైదానంలోకి వచ్చి విధ్వంసం సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

క్రికెట్ మైదానంలో కోతుల భయం..

భారతదేశంలోని ప్రతి గ్రామం, నగరంలో అనేక క్రికెట్ మైదానాలు ఉన్నాయి. ఇక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ప్రతిరోజూ క్రీడలు ఆడటానికి వస్తుంటారు. కొందరు ఫుట్‌బాల్ కూడా ఆడుతుంటారు. కొందరు క్రికెట్ ఆడతారు. ఈ క్రమంలో ఓ మైదానంలో పిల్లలు క్రికెట్ ఆడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. అకస్మాత్తుగా ఒక కోతి పిల్లల ఆట మధ్యలోకి ప్రవేశించి మొత్తం మైదానంలో విధ్వంసం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

క్రికెట్ మైదానంలో ఆడుతున్న పిల్లలు కోతిని చూసి భయపడి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తడం మొదలుపెడతారు. కోతి కూడా పిల్లల వెంట పరిగెత్తి, చాలా మందిని తన్ని కిందపడేస్తుంది. కోతి కారణంగా పిల్లలు గాయపడ్డారు. పిల్లలు ఏడవడం కూడా చూడొచ్చు. ఈ వీడియోలో, కొంతమంది పిల్లలు చేతిలో క్రికెట్ బ్యాట్లు పట్టుకుని కోతిని తరిమికొట్టడానికి కూడా ప్రయత్నించారు.

మైదానంలో కొండముచ్చు హల్చల్..

ఈ కొండముచ్చు భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఈ పిల్లలు క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చారు, కానీ ఆట WWEలా ముగిసింది’ అని రాసుకొచ్చాడు. మరొక యూజర్ ‘ఇక్కడ కబడ్డీ మ్యాచ్ జరుగుతుందని అనుకుంటా’ అంటూ కామెంట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..