
Men’s Asia Cup Rising Stars 2026: మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహిస్తున్న ఈ టోర్నీ నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లోని దోహాలో జరగనుంది. ఈ పోటీల్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. 50 ఓవర్ల ఫార్మాట్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా A జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ A జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
– గ్రూప్ A: బంగ్లాదేశ్ A, శ్రీలంక A, ఆఫ్ఘనిస్థాన్ A, హాంకాంగ్
– గ్రూప్ B: ఇండియా A, పాకిస్థాన్ A, నేపాల్, యూఏఈ
ప్రతి గ్రూపులో జట్లు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీస్.. నవంబర్ 29న ఫైనల్ జరగనుంది.
| తేదీ | మ్యాచ్ | సమయం |
|---|---|---|
| నవంబర్ 19 | బంగ్లాదేశ్ A vs హాంకాంగ్ | ఉదయం 11:30 |
| నవంబర్ 19 | శ్రీలంక A vs ఆఫ్ఘనిస్థాన్ A | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 20 | పాకిస్థాన్ A vs UAE | ఉదయం 11:30 |
| నవంబర్ 20 | ఇండియా A vs నేపాల్ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 21 | శ్రీలంక A vs హాంకాంగ్ | ఉదయం 11:30 |
| నవంబర్ 21 | బంగ్లాదేశ్ A vs ఆఫ్ఘనిస్థాన్ A | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 22 | UAE vs నేపాల్ | ఉదయం 11:30 |
| నవంబర్ 22 | ఇండియా A vs పాకిస్థాన్ A | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 23 | ఆఫ్ఘనిస్థాన్ A vs హాంకాంగ్ | ఉదయం 11:30 |
| నవంబర్ 23 | శ్రీలంక A vs బంగ్లాదేశ్ A | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 24 | ఇండియా A vs UAE | ఉదయం 11:30 |
| నవంబర్ 24 | పాకిస్థాన్ A vs నేపాల్ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 26 | సెమీఫైనల్ 1 | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 27 | సెమీఫైనల్ 2 | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 29 | ఫైనల్ | మధ్యాహ్నం 3:30 |
** అన్ని మ్యాచ్‌ల సమయాలు భారత కాలమానం (IST) ప్రకారం.
1. భారత్ ఏ vs నేపాల్
నవంబర్ 20, మధ్యాహ్నం 3:30 గంటలకు
వేదిక: వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దోహా
2. భారత్ ఏ vs పాకిస్తాన్ ఏ
నవంబర్ 22, మధ్యాహ్నం 3:30 గంటలకు
వేదిక: వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దోహా
3. భారత్ ఏ vs యూఏఈ
నవంబర్ 24, ఉదయం 11:30 గంటలకు
వేదిక: వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దోహా
టీవీలో..
సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానళ్లలో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్..
సోనిలివ్ యాప్, వెబ్సైట్ ద్వారా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..