మేం పసికూనలం కాదు: బంగ్లా కెప్టెన్‌

|

Jun 03, 2019 | 6:18 PM

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ జట్టుని పసికూనగా భావించొద్దని.. తాము ఇప్పుడు బలంగా మారామని, దక్షిణాఫ్రికా లాంటి  బలమైన జట్టుని ఓడించామని బంగ్లా కెప్టెన్ మష్రఫే మోర్తాజా పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పుడు ఎదిగిందని భావించాలా అని ప్రశ్నించగా.. ‘ఇది యాదృచ్ఛికంగా వచ్చిన గెలుపనుకుంటున్నారా? మేం మంచి ప్రదర్శన చేస్తే ఎలా ఆడగలమో మాకు తెలుసు. మా […]

మేం పసికూనలం కాదు: బంగ్లా కెప్టెన్‌
Follow us on

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ జట్టుని పసికూనగా భావించొద్దని.. తాము ఇప్పుడు బలంగా మారామని, దక్షిణాఫ్రికా లాంటి  బలమైన జట్టుని ఓడించామని బంగ్లా కెప్టెన్ మష్రఫే మోర్తాజా పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పుడు ఎదిగిందని భావించాలా అని ప్రశ్నించగా.. ‘ఇది యాదృచ్ఛికంగా వచ్చిన గెలుపనుకుంటున్నారా? మేం మంచి ప్రదర్శన చేస్తే ఎలా ఆడగలమో మాకు తెలుసు. మా ఆటపై చాలా మందికి చులకన భావం ఉందని కూడా తెలుసు. అయినా మేం అవేం పట్టించుకోము. మా ప్రదర్శనపైనే దృష్టిసారిస్తాం. ఇతరులే మా గురించి మాట్లాడతారు. ప్రపంచకప్‌ కన్నా ముందు కొన్ని మ్యాచ్‌లు బాగా ఆడాము. అయితే ఇదే మా అత్యుత్తమ విజయం కాదు. అత్యుత్తమ విజయాల్లో ఇదీ ఒకటని నేను భావిస్తున్నా. ఇంగ్లాండ్‌లో ప్రతీకూల పరిస్థితుల్లో చాలా బాగా ఆడామనే చెప్పాలి. ఎల్లప్పుడూ అలా సాధ్యం కాకపోవచ్చు. అయినా నేను మాత్రం ఇలాగే ఆడాలని కోరుకుంటా’ అని మోర్తాజా చెప్పుకొచ్చాడు.