భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోలేదు- సర్ఫరాజ్‌

|

Jul 07, 2019 | 9:54 PM

వరల్డ్ కప్ లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. అయితే మన ఓటమి ప్రభావం పాకిస్థాన్‌పై పడింది. వారి సెమీస్‌ అవకాశాలు మన ఓటమితో పూర్తిగా గల్లంతయ్యాయి. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై పాక్‌ మాజీ క్రికెటర్లు పరోక్షంగా కాస్త ఘాటు విమర్శలు గుప్పించారు. టీమిండియా కావాలని ఓడిపోయింది అన్నవారు కూడా లేకపోలేదు. కోహ్లీసేన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదంటూ ఆ జట్టు మాజీ క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ […]

భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోలేదు- సర్ఫరాజ్‌
Follow us on

వరల్డ్ కప్ లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. అయితే మన ఓటమి ప్రభావం పాకిస్థాన్‌పై పడింది. వారి సెమీస్‌ అవకాశాలు మన ఓటమితో పూర్తిగా గల్లంతయ్యాయి. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై పాక్‌ మాజీ క్రికెటర్లు పరోక్షంగా కాస్త ఘాటు విమర్శలు గుప్పించారు. టీమిండియా కావాలని ఓడిపోయింది అన్నవారు కూడా లేకపోలేదు. కోహ్లీసేన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదంటూ ఆ జట్టు మాజీ క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ విమర్శించాడు. అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ స్పందించాడు.

‘టీమిండియా కావాలని ఓడిపోయిందనటం సరైన వ్యాఖ్య కాదు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మంచి ప్రదర్శన చేయడం వల్లే కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. అంతేకానీ అందులో వేరే ఉద్దేశమేమీ లేదు. ’ అని సర్ఫరాజ్‌ పేర్కొన్నాడు.