శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్..కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవం

|

May 04, 2019 | 7:19 AM

మొహాలి:  పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి రెండు ఓవర్లు మిగులుండగానే ఛేదించింది.  దీంతో ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లే. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(65; 49 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో చెలరేగి నాటౌట్‌గా నిలవగా మరో ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ (46; 22 బంతుల్లో 5×4, 3×6) హాఫ్ సెంచరీ జస్ట్ మిస్సయ్యాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు […]

శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్..కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవం
Follow us on

మొహాలి:  పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి రెండు ఓవర్లు మిగులుండగానే ఛేదించింది.  దీంతో ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లే. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(65; 49 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో చెలరేగి నాటౌట్‌గా నిలవగా మరో ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ (46; 22 బంతుల్లో 5×4, 3×6) హాఫ్ సెంచరీ జస్ట్ మిస్సయ్యాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రిస్‌లిన్‌ ఔటయ్యాక రాబిన్‌ ఉతప్ప(22), ఆండ్రీ రసెల్‌(24) ధాటిగా ఆడి స్కోర్‌బోర్డుని పరుగులు పెట్టించారు. వీరిద్దరూ పెవిలియన్‌ చేరాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌(21;9 బంతుల్లో 2×4, 1×6) బౌండరీలతో చెలరేగి శుభ్‌మన్‌తో కలిసి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. కాగా పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, అశ్విన్‌, ఆండ్రీ టై తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కొత్త కుర్రాడు సందీప్ వారియర్ ఓపెనర్లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చి, పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. లోకేశ్ రాహుల్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా…క్రిస్‌గేల్ 14 పరుగులు చేసి సందీప్ వారియర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్‌ పూరన్, మయాంక్ అగర్వాల్ కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసిన నికోలస్ పూరన్… నితీశ్ రాణా బౌలింగ్‌లో సందీప్ వారియర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాాత కొద్దిసేపటికే 36 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా అవుట్ కావడంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మన్‌దీప్ సింగ్ 25 పరుగులు చేసి గుర్నే బౌలింగ్‌లో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన, రస్సెల్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత సామ్ కరన్ చెలరేగిపోయాడు.  24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సామ్ కుర్రాన్. గుర్నే వేసిన చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన సామ్ కరన్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. సందీప్ వారియర్‌కు రెండు వికెట్లు దక్కగా, నితీశ్ రాణా, గుర్నే, రస్సెల్‌కు తలా ఓ వికెట్ దక్కాయి.