Shreyas Iyer: 32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా

Shreyas Iyer: లక్నోలోని ఏకానా స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ విండీస్‌పై 42 బంతుల్లోనే 102 రన్స్‌తో చారిత్రాత్మక సెంచరీ బాదాడు. ఈ మైదానంలో 5 ఇన్నింగ్స్‌ల్లో 335 పరుగులు చేసి 32 ఫోర్లు, 17 సిక్సర్లతో చెలరేగాడు. రోహిత్, సూర్య తర్వాత టీ20ల్లో కెప్టెన్‌గా సెంచరీ కొట్టిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

Shreyas Iyer: 32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
Shreyas Iyer (3)

Updated on: Oct 07, 2026 | 8:02 AM

Shreyas Iyer: లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తూ కాస్త నెమ్మదిగా ఉంటుందని పేరు. కానీ మన శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి దిగితే మాత్రం ఆ పిచ్ బ్యాటింగ్ ప్యారడైజ్‌లా మారిపోతుంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అయ్యర్ కేవలం 42 బంతుల్లోనే అజేయంగా 102 రన్స్ చేసి ఊచకోత కోశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇది అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. లక్నో మైదానంలో శ్రేయస్ గణాంకాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

5 ఇన్నింగ్స్‌ల్లో 335 పరుగులు

లక్నో స్టేడియం శ్రేయస్ అయ్యర్‌కు ఎంతగా కలిసివచ్చిందో చెప్పడానికి అతని గణాంకాలే పక్కా నిదర్శనం. ఈ మైదానంలో ఆడిన గత 5 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో కలిపి 335 పరుగులు బాదాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ కావడం మరో అద్భుతం. ఈ మైదానంలో శ్రేయస్ ఏకంగా 200.59 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడుతూ 32 ఫోర్లు, 17 సిక్సర్లు బాది మైదానాన్ని హోరెత్తించాడు.

ఐపీఎల్ 2026 నుంచి మొదలైన విశ్వరూపం

లక్నో మైదానంలో శ్రేయస్ ఆడిన గత ఐదు టీ20 స్కోర్లు వరుసగా 57, 23, 52, 101, 102 కావడం గమనార్హం. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో కూడా శ్రేయస్ 51 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు వెస్టిండీస్‌పై 102 రన్స్ చేసి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఈ గ్రౌండ్‌లో సెంచరీ సాధించి తనే లక్నో రియల్ కింగ్ అని నిరూపించుకున్నాడు.

కెప్టెన్‌గా మూడో సెంచరీ

ఈ ఊచకోత ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

* కెప్టెన్‌గా టీ20 సెంచరీ: అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా సెంచరీ కొట్టిన మూడో భారత బ్యాటర్‌గా శ్రేయస్ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ (3 సెంచరీలు), సూర్యకుమార్ యాదవ్ (1 సెంచరీ) మాత్రమే ఈ ఘనత సాధించారు.

* రెండో ఫాస్టెస్ట్ సెంచరీ : టీమిండియా కెప్టెన్‌గా టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ (42 బంతుల్లో) బాదిన రికార్డు నమోదు చేశాడు. రోహిత్ శర్మ 35 బంతుల్లో చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉంది.

* విండీస్‌పై ఛేజింగ్ సెంచరీ: వెస్టిండీస్‌పై ఛేజింగ్‌లో సెంచరీ కొట్టిన నాలుగో భారత బ్యాటర్‌గా శ్రేయస్ రికార్డుల్లోకెక్కాడు. కేఎల్ రాహుల్ రెండుసార్లు ఈ ఘనత సాధించగా, రోహిత్, సూర్య చెరోసారి చేశారు.

విండీస్ బౌలర్లకు నైట్‌మేర్

వెస్టిండీస్ విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే పూర్తి చేసి భారీ విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ మొదటి నుంచి విండీస్ బౌలర్లను కుదురుకోనీయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఎటాకింగ్ చేసి మైదానంలో సిక్సర్ల పండగ చేశాడు. అతని ధాటికి కరేబియన్ బౌలర్లు దిక్కుతోచక చేతులెత్తేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us