IND Vs SL: 9 ఏళ్లలో 23 మ్యాచ్‌లు.. కట్ చేస్తే 37 బంతుల్లో టీమిండియాను మడతెట్టేసిన అనామకుడు

|

Aug 05, 2024 | 1:41 PM

అదృష్టం ఎప్పుడు.? ఎవర్ని వరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇక క్రికెట్ విషయానికొస్తే.. ఆటగాడు హీరో నుంచి విలన్‌గా మారొచ్చు. అప్పుడప్పుడూ విలన్ నుంచి హీరోగా మారొచ్చు. 34 ఏళ్ల క్రికెటర్‌తోనూ ఇదే జరిగింది. కొన్నిసార్లు క్రమశిక్షణా రాహిత్యంతో జట్టులో చోటు కోల్పోతే..

IND Vs SL: 9 ఏళ్లలో 23 మ్యాచ్‌లు.. కట్ చేస్తే 37 బంతుల్లో టీమిండియాను మడతెట్టేసిన అనామకుడు
Ind Vs Sl
Follow us on

అదృష్టం ఎప్పుడు.? ఎవర్ని వరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇక క్రికెట్ విషయానికొస్తే.. ఆటగాడు హీరో నుంచి విలన్‌గా మారొచ్చు. అప్పుడప్పుడూ విలన్ నుంచి హీరోగా మారొచ్చు. 34 ఏళ్ల క్రికెటర్‌తోనూ ఇదే జరిగింది. కొన్నిసార్లు క్రమశిక్షణా రాహిత్యంతో జట్టులో చోటు కోల్పోతే.. మరోసారి ఈ ప్లేయర్ స్థానాన్ని ఇంకో ఆటగాడు భర్తీ చేశాడు. ఇలా 9 ఏళ్లలో ఈ ఆటగాడు ఆడింది కేవలం 23 మ్యాచ్‌లు మాత్రమే. కట్ చేస్తే.. ఇప్పుడు 37 బంతుల్లో టీమిండియాను మడతెట్టేశాడు. అతడే శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే. రెండో వన్డేలో టీమ్ ఇండియాను తన స్పిన్ ఉచ్చులో ఇరికించి.. లంకకు అద్భుత విజయాన్ని అందించాడు.

వన్డే సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఆగస్టు 4న ఆదివారం భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు, శ్రీలంక జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక అతడి స్థానాన్ని భర్తీ చేస్తూ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు వాండర్సే. 34 ఏళ్ల వాండర్సే జనవరి 2024లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.

కేవలం 37 బంతుల్లోనే విధ్వంసం..

టీమిండియాతో టీ20 మ్యాచ్‌లు ఆడిన వాండర్సే.. ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ స్పిన్నర్ టీమ్ ఇండియాపై ఏమాత్రం ప్రభావం చూపించడని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే..! మ్యాచ్‌నే మలుపు తిప్పేశాడు. మొదటగా రోహిత్ శర్మను తన స్పిన్‌ ఉచ్చులో ట్రాప్ చేయగా.. ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్, శివమ్ దూబే, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్‌ను పెవిలియన్ చేర్చాడు. టీమిండియా తొలి 6 వికెట్లను వాండర్సే తీయడంతో పాటు కేవలం 6.1 ఓవర్లలోనే ఈ రికార్డు సృష్టించాడు. తన 10 ఓవర్లలో మొత్తం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌కు ముందు, వాండర్సే 22 మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఎన్నడూ 5 వికెట్లను తీయలేకపోయాడు. ఈసారి ఆ నిరీక్షణకు ఎండ్ కార్డు ఇచ్చాడు. ఇక ఈ ఘనత అతడికి ఎంతో ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. 2018లో వెస్టిండీస్ టూర్‌లో జట్టులో చోటు దక్కించుకున్న వాండర్సేకు.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత అతడు ఆడిన చివరి టెస్టు మ్యాచ్‌కు ముందుగా కూడా క్రమశిక్షణా రాహిత్యంతో జట్టును తొలగించబడ్డాడు.