Irfan Pathan : కుక్క మాంసం తిన్నాడు, అందుకే అలా మొరుగుతున్నాడు.. పాక్ క్రికెటర్ పై ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా, ఇర్ఫాన్ పఠాన్కు మద్దతు ఇచ్చారు. ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో జరిగిన వాగ్వాదం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అఫ్రిది తరచుగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తుంటాడని ఇర్ఫాన్ ఆరోపించారు.

Irfan Pathan : కుక్క మాంసం తిన్నాడు, అందుకే అలా మొరుగుతున్నాడు.. పాక్ క్రికెటర్ పై ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు
Shahid Afridi

Updated on: Aug 19, 2025 | 9:51 AM

Irfan Pathan : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గురించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. 2006 టూర్‌లో పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు అఫ్రిదితో తనకు జరిగిన వాగ్వాదం గురించి పఠాన్ తాజాగా వివరించారు. ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా కూడా స్పందిస్తూ, అఫ్రిదిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పఠాన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇర్ఫాన్ పఠాన్ ‘లల్లన్‌టాప్’ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. “2006 టూర్ సమయంలో కరాచీ నుంచి లాహోర్‌కి ఫ్లైట్‌లో వెళ్తున్నాం. రెండు జట్ల ఆటగాళ్లు కూడా ఒకే ఫ్లైట్‌లో ఉన్నారు. అఫ్రిది వచ్చి నా నెత్తిపై చేయి వేసి, నా జుట్టు చిందరవందర చేశాడు. ఏరా అబ్బాయి, ఎలా ఉన్నావు? అని అడిగాడు. అతను ఎప్పుడు నా తండ్రి అయ్యాడు అని నేను మనసులో అనుకున్నాను. అతనో చిన్న పిల్లాడిలా ప్రవర్తించాడు. నేను అతనితో మాట్లాడ లేదు, కానీ అతను నా సీటు దగ్గరకు వచ్చి నన్ను విమర్శించడం మొదలుపెట్టాడు” అని పఠాన్ చెప్పారు.

అఫ్రిది ఇలా ప్రవర్తించడం చూసి పక్కనే ఉన్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్‌ను ఇర్ఫాన్ పఠాన్ ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రాంతంలో ఎలాంటి మాంసం దొరుకుతుంది? అని రజాక్‌ను పఠాన్ అడిగాడు. రజాక్ వివిధ జంతువుల మాంసం లభిస్తుందని చెప్పగానే, ఇర్ఫాన్ కుక్క మాంసం దొరుకుతుందా? అని అడిగాడు. ఇందుకు రజాక్ ఆశ్చర్యపోయి, ఏంటి ఇర్ఫాన్, అలా అంటావు? అని అడిగాడు. అప్పుడు పఠాన్ “అతను (అఫ్రిది) కుక్క మాంసం తిన్నాడు. అందుకే చాలాసేపటి నుంచి మొరుగుతున్నాడు” అని సమాధానం ఇచ్చాడు.

ఈ సమాధానం విన్న తర్వాత అఫ్రిది ఏమీ మాట్లాడలేదని పఠాన్ చెప్పారు. “ఆ తర్వాత అతను ఏమైనా మాట్లాడితే, ‘చూడండి, అతను ఇంకా మొరుగుతున్నాడు’ అని నేను అనేవాడిని. అందుకే అతను ఆ ఫ్లైట్‌లో ఉన్నంత సేపు సైలెంట్‌గా ఉన్నాడు. నాతో వాదన పెట్టుకుంటే ఓడిపోతానని అతనికి అర్థమైంది. అందుకే అతను నాతో మళ్లీ మాట్లాడలేదు” అని పఠాన్ వివరించారు.

ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా ట్విట్టర్‌లో స్పందిస్తూ ఇర్ఫాన్ పఠాన్‌కు మద్దతు ఇచ్చారు. “ఇర్ఫాన్ భాయ్, మీరు చెప్పింది అక్షరాలా నిజం. అతను ఎల్లప్పుడూ ఇతరుల కుటుంబం లేదా మతం గురించి వ్యక్తిగత దాడులకు దిగుతాడు” అని కనేరియా పేర్కొన్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..