IPL 2022: పాయింట్ల పట్టికలో గుజరాత్‌ నెంబర్‌ వన్.. హైదరాబాద్‌ భారీ జంప్..!

| Edited By: Anil kumar poka

Apr 24, 2022 | 8:09 AM

IPL 2022: ఐపీఎల్‌లో ఏ జట్టుని తక్కువ అంచనా వేయలేం. బలహీనంగా కనిపించే జట్లు కూడా బలంగా మారే పరిస్థితులు ఉంటాయి.

IPL 2022: పాయింట్ల పట్టికలో గుజరాత్‌ నెంబర్‌ వన్.. హైదరాబాద్‌ భారీ జంప్..!
Gujarat Titans
Follow us on

IPL 2022: ఐపీఎల్‌లో ఏ జట్టుని తక్కువ అంచనా వేయలేం. బలహీనంగా కనిపించే జట్లు కూడా బలంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఐపీఎల్ 2022లో కూడా అదే జరుగుతుంది. ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలం తర్వాత గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టని అందరు తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు లీగ్ దశలో సగం మ్యాచ్‌లు ముగియడంతో ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఏప్రిల్ 23 జరిగిన మ్యాచ్‌లలో గుజరాత్, హైదరాబాద్ ప్రత్యర్థి జట్టని మట్టికరిపించి మొదటి, రెండవ స్థానాలను ఆక్రమించాయి.

శనివారం గుజరాత్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యా్‌చ్‌లో చివరి బంతి వరకు విజేతను ఊహించడం కష్టమైంది. కోల్‌కతా జట్టు గుజరాత్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోలుకోలేని దెబ్బతీశారు. బెంగళూరు జట్టు కేవలం 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిన్న లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సాధించింది.

హైదరాబాద్ భారీ జంప్

ఈ మ్యాచ్‌లకు ముందు గుజరాత్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పుడు 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లను కలిగి ఉంది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగో ఓటమి తర్వాత ఏడో స్థానంలో ఉంది. అయితే హైదరాబాద్ ఐదో విజయంతో 10 పాయింట్లను కలిగి ఉంది. కానీ పెద్ద విజయం దాని నెట్ రన్ రేట్‌ను బాగా మెరుగపరిచింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, బెంగళూరుని దాటేసి రెండవ స్థానానికి ఎగబాకింది. బెంగళూరు నాలుగో స్థానానికి పడిపోయింది.

మరిన్ని క్రికెట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..

NEP 2020: ఆ రాష్ట్రంలో ఇక ఎంఫిల్‌ చదువులకి స్వస్తి.. బీఈడీ కోర్సు నాలుగు సంవత్సరాలు..!

CRIS Recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ నుంచి నోటిఫికేషన్..