‘సన్‌రైజర్స్’ ప్లేఆఫ్స్‌కు చేరతారా..?

|

May 05, 2019 | 12:51 PM

గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చోటు ఖాయమనుకునే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పేలవమైన ఆటతీరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీనితో సన్‌రైజర్స్ ఇప్పుడు అదృష్టంపై ఆధారపడింది. ఈరోజు జరగనున్న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే.. మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ కోల్‌కతా గెలిస్తే.. సన్‌రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. సునాయాసంగా ప్లే‌ఆఫ్స్‌కు చేరుకునే ఆఖరి అవకాశాన్ని […]

సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరతారా..?
Follow us on

గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చోటు ఖాయమనుకునే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పేలవమైన ఆటతీరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీనితో సన్‌రైజర్స్ ఇప్పుడు అదృష్టంపై ఆధారపడింది. ఈరోజు జరగనున్న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే.. మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ కోల్‌కతా గెలిస్తే.. సన్‌రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. సునాయాసంగా ప్లే‌ఆఫ్స్‌కు చేరుకునే ఆఖరి అవకాశాన్ని సన్‌రైజర్స్‌ నిన్న చేజేతులా జారవిడుచుకుంది.

మరోవైపు.. వరుసగా 6 మ్యాచుల్లో ఓడిన కోల్‌కతా  రీసెంట్‌గా ఫామ్‌లోకి వచ్చింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తూ ప్రమాదకర జట్టుగా మారింది. ఈక్రమంలో ఇవాళ ముంబైతో జరిగే మ్యాచ్‌ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది.