Asia Cup: ఆసియా కప్ చరిత్రలో దూసుకుపోతున్న భారత్.. పాకిస్థాన్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Asia Cup: ఆసియా కప్ చరిత్రలో భారత్‌దే తిరుగులేని ఆధిపత్యం. పురుషుల విభాగంలో 9, మహిళల విభాగంలో 8 టైటిళ్లతో టీమిండియా మొత్తం 17 ట్రోఫీలు సాధించింది. శ్రీలంక 7 టైటిళ్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ కేవలం 2 ట్రోఫీలతో చాలా వెనుకబడి ఉంది. మహిళల ఆసియా కప్‌లో పాక్ ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోవడం విశేషం.

Asia Cup: ఆసియా కప్ చరిత్రలో దూసుకుపోతున్న భారత్.. పాకిస్థాన్ ఏ స్థానంలో ఉందో తెలుసా?
Asia Cup

Updated on: Sep 15, 2026 | 7:41 AM

Asia Cup: క్రికెట్ ప్రపంచంలో ఆసియా కప్ టోర్నమెంట్‌పై భారత జట్లు సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతోంది. రెండు జట్లు సాధించిన విజయాల సంఖ్యను కలిపి చూస్తే ప్రపంచ దేశాలు విస్తుపోయే అసాధారణ రికార్డు భారత్ పేరున ఉంది.

పురుషుల ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్లలో టీమిండియా ఏడుసార్లు వన్డే అలాగే రెండుసార్లు టీ20 ఫార్మాట్లలో కలిపి మొత్తం 9 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంక 6 ట్రోఫీలతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించింది. పదేపదే మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ భారత పురుషుల జట్టు ఈ మెగా టోర్నీలో తిరుగులేని శక్తిగా అవతరించింది.

కేవలం పురుషుల క్రికెట్‌లోనే కాకుండా మహిళల ఆసియా కప్ టోర్నీలలోనూ భారత జట్టు తిరుగులేని జోరును ప్రదర్శించింది. ఇటీవల ముగిసిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించి 8వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో మహిళల విభాగంలో భారత్ తన విజయాల పరంపరను మరింత విస్తరించింది. శ్రీలాంక అలాగే బంగ్లాదేశ్ జట్లు చెరో ఒక్కసార మాత్రమే ఈ ట్రోఫీని గెలుచుకోగా, భారత మహిళల జట్టు 8 సార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.

పురుషులు అలాగే మహిళల జట్లు సాధించిన విజయాలను సంయుక్తంగా పరిశీలిస్తే ఆసియా కప్ చరిత్రలో భారత్ మొత్తం 17 ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలాంక జట్టు పురుషుల విభాగంలో ఆరు అలాగే మహిళల విభాగంలో ఒకటి కలిపి మొత్తం 7 ట్రోఫీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక పాకిస్థాన్ జట్టు కేవలం పురుషుల విభాగంలో రెండు ట్రోఫీలు మాత్రమే సాధించగా, మహిళల జట్టు ఒక్కసారి కూడా ఈ టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. దీనివల్ల పాకిస్థాన్ కేవలం రెండు ట్రోఫీలతో చాలా వెనుకబడి ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us