IND vs WI 1st T20I:  భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు, వైభవ్‎కి నిరాశే!

IND vs WI 1st T20I:  భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య లక్నో వేదికగా నేడు మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తుది జట్టులో 4 పెద్ద మార్పులు చేయనున్నారు. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కాగా, కుల్దీప్ యాదవ్, నితీష్ రెడ్డి తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.

IND vs WI 1st T20I:  భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు, వైభవ్‎కి నిరాశే!
Ind Vs Wi

Updated on: Oct 06, 2026 | 9:15 AM

IND vs WI 1st T20I: భారత్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు లక్నోలోని ఎకానా స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్ 2026లో పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించిన ఊపులో టీమిండియా ఉంది. ఆ విజయం సాధించిన రెండ్రోజులకే భారత్ ఈ సిరీస్ ఆడబోతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జోడీ ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో నాలుగు కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం

15 ఏళ్ల విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో తుది జట్టుకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా క్రీడల్లో బౌలింగ్ కాంబినేషన్ కోసం ఇద్దరు ఓపెనర్లతో భారత్ బరిలోకి దిగినప్పటికీ, వెస్ట్ ఇండీస్‌పై అది సాధ్యపడదు. జపాన్ పర్యటనలో నిరాశపరిచినప్పటికీ, అంతకుముందు అఫ్గానిస్థాన్‌పై వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన సంజూ శామ్సన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు

ఈ సిరీస్ నుంచి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో పేస్ విభాగానికి అర్ష్‌దీప్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. సుందర్ స్థానంలో యంగ్ ఫాస్ట్ బౌలర్లు ప్రిన్స్ యాదవ్ లేదా మయంగ్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఇక స్పిన్ విభాగంలో గత కొన్ని మ్యాచ్‌లుగా ఆకట్టుకోలేకపోతున్న రవి బిష్ణోయ్ స్థానంలో, వన్డే సిరీస్‌‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ

జట్టులో బ్యాటింగ్ డెప్త్ పెంచడానికి వైభవ్ సూర్యవంశీ స్థానంలో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డిని ఆల్‌రౌండర్‌గా తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. శివం దూబే, అక్షర్ పటేల్‌లతో పాటు నితీష్ చేరికతో భారత ఆల్‌రౌండ్ విభాగం మరింత బలంగా మారనుంది. ఈ మార్పుల ద్వారా లక్నో పిచ్‌పై విండీస్ హిట్టర్లను కట్టడి చేయాలని గంభీర్ ప్రణాళికలు రచిస్తున్నాడు.

ఇరు జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు

భారత టీ20 స్క్వాడ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, మయంగ్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, వైభవ్ సూర్యవంశీ.

వెస్ట్ ఇండీస్ టీ20 స్క్వాడ్: రోవ్‌మన్ పొవెల్ (కెప్టెన్), షై హోప్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్ర్ మెయిర్, రోస్టన్ ఛేజ్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోతీ, అకీల్ హొస్సేన్, షమర్ జోసెఫ్, జేసన్ హోల్డర్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, ఒషేన్ థామస్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us