IND vs SA 1st T20: సంజూ శాంసన్ ‘కేసీపీడీ’ ఇన్నింగ్స్.. ఇలా కదా.. మనం టీమిండియాను చూడాలనుకుంది..!

డర్బన్‌లో సౌతాఫ్రీకాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎంతంటే?

IND vs SA 1st T20: సంజూ శాంసన్ కేసీపీడీ ఇన్నింగ్స్.. ఇలా కదా.. మనం టీమిండియాను చూడాలనుకుంది..!
Ind Vs Sa 1st T20i Team India First Innings Score

Updated on: Nov 09, 2024 | 1:03 AM

డర్బన్‌లో సౌతాఫ్రీకాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. శాంసన్(107), తిలక్ వర్మ(33) పరుగులతో చెలరేగిపోయారు. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు.  వాస్తవానికి 15 ఓవర్లకే టీమిండియా కనీసం 250 ప్లేస్ రన్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా సంజూ ఔటయ్యాక మిగితా ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. 18వ ఓవర్లో బౌండరీలే రాలేదు. సౌతాఫ్రికా బౌలర్లు కొయెట్జీ 3 వికెట్లు, జాన్సెన్, మహరాజ్, పీటర్, క్రూగర్ తలో వికెట్ తీశారు.

ఇదిలా ఉంటే భారత్ రికార్డు సృష్టించింది. టీ20 2023లో సౌతాఫ్రీకాపై భారత్ ఒక ఇన్నింగ్స్‌లో డజను సిక్సర్లు కొట్టింది. దక్షిణాఫ్రికాలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత రికార్డు ఇదే. ఈ రోజు సంజు ఒక్కడే 10 సిక్సర్లు కొట్టాడు. తిలక్ రెండు కొట్టగా స్కై ఒక సిక్స్ కొట్టాడు. గతేడాది ఆ రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us