IND vs ENG: 66 బంతుల్లో 23 పరుగులు.. ఇదెక్కడి ఆట సామీ.. ఇక హైదరాబాద్ నుంచి నేరుగా ఇంటికే.. ఫ్యాన్స్ ఫైర్

|

Jan 26, 2024 | 12:22 PM

Shubman Gill: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రోహిత్ 27 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. హిట్‌మ్యాన్‌ను జాక్ లీచ్ అవుట్ చేశాడు. అనంతరం శుభ్‌మన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలి రోజు ఆట ముగిసే వరకు నాటౌట్‌గా నిలిచాడు. కానీ రెండో రోజు తొలి సెషన్‌లోనే శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. 66 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు కొట్టాడు.

IND vs ENG: 66 బంతుల్లో 23 పరుగులు.. ఇదెక్కడి ఆట సామీ.. ఇక హైదరాబాద్ నుంచి నేరుగా ఇంటికే.. ఫ్యాన్స్ ఫైర్
Shubman Gill
Follow us on

Shubman Gill, India vs England: టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా పేరుగాంచిన యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్.. గత కొన్ని మ్యాచ్‌ల్లో పేలవ ఫాంతో సతమతమవుతున్నాడు. తాజాగా, హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం 23 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ పెవిలియన్ చేరి, తన బ్యాట్ ఝులిపించలేకపోయాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ అతనికి పెవిలియన్ దారి చూపించాడు. హార్ట్లీ తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. గిల్ అతని మొదటి బాధితుడిగా మారాడు.

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రోహిత్ 27 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. హిట్‌మ్యాన్‌ను జాక్ లీచ్ అవుట్ చేశాడు. అనంతరం శుభ్‌మన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలి రోజు ఆట ముగిసే వరకు నాటౌట్‌గా నిలిచాడు. కానీ రెండో రోజు తొలి సెషన్‌లోనే శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. 66 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు కొట్టాడు.

మొదటి ఇన్నింగ్స్ సమయంలో టామ్ హార్ట్లీ ఇంగ్లండ్ తరపున 35వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. తన ఓవర్ ఐదో బంతికి శుభ్‌మన్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. మిడ్ వికెట్ వద్ద నిలబడిన డకెట్ ఎలాంటి పొరపాటు లేకుండా క్యాచ్ పట్టాడు. ఇంగ్లండ్ బౌలర్ టామ్ హార్ట్లీ భారత జట్టుకు డేంజర్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ఈ బౌలర్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

గిల్ చివరి 10 ఇన్నింగ్స్ స్కోర్లు..

గిల్ గత 10 ఇన్నింగ్స్ స్కోర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 23, 10, 36, 26, 2, 29 నాటౌట్, 10, 6, 18, 13 పరుగులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 55 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులతో బ్యాటింగ్ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..