టీమిండియా 2019 వరల్డ్ కప్‌లో ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు టీమిండియా జట్టుగా, ఆటగాళ్లు వ్యక్తిగతంగా నమోదు చేసిన రికార్డ్స్‌పై స్పెషల్ ఫోకస్
………………………………..
శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు అందుకున్న భారత్, సగర్వంగా 7 సారి వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ లో కి అడుగుపెట్టిన రెండో జట్టుగా పేరొందింది. అయితే 8 సార్లు వరల్డ్ కప్ సెమీఫైనల్ దశకు వెళ్లిన జట్టుగా ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. 2019 టోర్నీలో సైతం భారత్ టైటిల్ ఫేవరట్ గా అడగుపెట్టి అదే స్థాయిలో ఏకంగా 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో ఘనవిజయం సాధించింది.
……………………………………….
ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ ఏకంగా ఒకే టోర్నీలో 5 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అదే స్థాయిలో 647 పరుగులతో రోహిత్ శర్మ ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతోన్నాడు. మొత్తం టోర్నీలో 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు బాది రోహిత్ తన తిరుగులేని ఫామ్ ను మరోసారి నిరూపించుకున్నాడు.
………………………………
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తన ఇంటర్నేషనల్ వన్డే కెరీర్ లో 100 వికెట్ల మైలురాయిని ఈ మ్యాచులోనే అందుకోవడం విశేషం. అలాగే వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రెండవ భారతీయ క్రికెటర్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు.
…………………………..
లీగ్ దశలో జరిగిన ఇండియా వెర్సస్ అప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ..వరల్డ్ కప్ హిస్టరీలో హ్యట్రిక్ వికెట్లు తీసిన రెండో భారత్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
…………………………
ఇక వరల్డ్ కప్ హిస్టరీలో 1000 రన్స్ పూర్తి చేసిన 3వ భారత్ ఆటగాడిగా కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో ఈ ఫీట్‌ను భారత్ తరుపున సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ సాధించారు.