ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, విధ్వంసకర వెస్టిండీస్ మధ్య నేడు నాటింగ్హమ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో విజయాన్ని సాధించాయి. గెలుపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. వార్నర్, స్మిత్, ఫించ్, ఖాజా, మ్యాక్స్‌వెల్‌లతో పటిష్టంగా ఉన్న ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసేందుకు విండీస్ ఫాస్ట్ బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రెండు జట్లలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.