అరె భాయ్ కేక్ ఎక్కడ?..ధోనికి..’హిట్ మ్యాన్’ బర్త్ డే విషెస్

|

Jul 07, 2019 | 7:08 PM

ఈ రోజు మిస్టర్ కూల్, భారత మాజీ కుప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ ధోని బర్త్ డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘తలా’ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ విషెస్ చెప్తున్నారు. #HappyBirthdayMSD అనే హ్యష్ టాక్  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నడుస్తోంది. వరల్డ్ కప్ పర్యటనలో ఉన్న ధోని తన భార్య, కూతురుతో పాటు..సహచర సభ్యుల సమక్షంలో బర్త్ డే […]

అరె భాయ్ కేక్ ఎక్కడ?..ధోనికి..హిట్ మ్యాన్ బర్త్ డే విషెస్
Follow us on

ఈ రోజు మిస్టర్ కూల్, భారత మాజీ కుప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ ధోని బర్త్ డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘తలా’ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ విషెస్ చెప్తున్నారు. #HappyBirthdayMSD అనే హ్యష్ టాక్  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నడుస్తోంది. వరల్డ్ కప్ పర్యటనలో ఉన్న ధోని తన భార్య, కూతురుతో పాటు..సహచర సభ్యుల సమక్షంలో బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు.

భారత జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వెరైటీగా ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘అరే భాయ్ కేక్ ఎక్కడ?. పుట్టిన రోజు శుభాకాంక్షలు.’ అంటూ ట్వీట్ చేశారు. అందులో వారిద్దరూ కలిసి ఉన్న పాత ఫొటోను పంచుకున్నాడు.