Cricket: 52 నిమిషాల బ్యాటింగ్ విధ్వంసం.. 7 సిక్సర్లతో 70 పరుగులు.. బౌలర్లపై వీరవిహారం..

|

Dec 28, 2021 | 7:15 PM

ఒకవైపు టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా.. మరోవైపు యాషెస్ పోరు వన్ సైడెడ్ అయిపోయింది...

Cricket: 52 నిమిషాల బ్యాటింగ్ విధ్వంసం.. 7 సిక్సర్లతో 70 పరుగులు.. బౌలర్లపై వీరవిహారం..
Finn Allen
Follow us on

ఒకవైపు టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా.. మరోవైపు యాషెస్ పోరు వన్ సైడెడ్ అయిపోయింది. ఇక కొత్త సంవత్సరంలో న్యూజిలాండ్ టీం.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్దమవుతోంది. ఇదిలా ఉంటే.. డొమెస్టిక్ క్రికెట్‌లో ఇద్దరు కివీస్ ప్లేయర్స్ అదరగొట్టారు. న్యూజిలాండ్ టీ20 లీగ్ సూపర్ స్మాష్ గురించి మీరు వినే ఉంటారు. ఆ లీగ్‌లో 22 ఏళ్ల ఫిన్ అలెన్, 23 ఏళ్ల నాథన్ స్మిత్‌లు తుఫాన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్ధి బౌలర్ల భరతం పట్టారు.

ఇటీవల సూపర్ స్మాష్‌లో ఒటాగో, వెల్లింగ్టన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఒటాగో జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు నమోదు చేసింది. అనారు కిచెన్(54) అర్ధ సెంచరీ సాధించగా.. జోన్స్(35), రిప్పొన్(28)లు ఫర్వాలేదనిపించారు. అటు వెల్లింగ్టన్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 2 వికెట్లు పడగొట్టాడు.

ఒకరు ఆట ప్రారంభిస్తే.. మరొకరు ముగించారు…

167 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెల్లింగ్టన్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. రాబిన్‌సన్(65) అర్ధ సెంచరీతో కీలక పాత్ర పోషించగా.. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విజృంభించారు. వారే ఓపెనర్ ఫిన్ అలెన్, నాథన్ స్మిత్‌లు. 22 ఏళ్ల ఫిన్ అలెన్ 20 నిమిషాలు బ్యాటింగ్ చేసి 13 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక నాథన్ స్మిత్ 32 నిమిషాల పాటు క్రీజులో నిలిచి నిలిచి కేవలం 18 బంతుల్లో 4 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. అలాగే జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఇద్దరి బ్యాట్స్‌మెన్ల సగటు 200 పైగా ఉండటం గమనార్హం.