బ్యాటర్‌గా ఎంట్రీ.. గర్ల్‌ఫ్రెండ్ కోరికతో కీపర్‌గా అవతారం.. కట్‌చేస్తే.. 1495 మందిని పెవిలియన్ చేర్చి ప్రపంచ రికార్డ్..

|

Jan 28, 2023 | 9:53 AM

Herbert Strudwick: ఇంగ్లండ్‌కు చెందిన హెర్బర్ట్ స్టర్డ్‌విక్ ఓ అమ్మాయి కోరిక మేరకు వికెట్ కీపింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో భయాందోళనలు సృష్టించాడు.

బ్యాటర్‌గా ఎంట్రీ.. గర్ల్‌ఫ్రెండ్ కోరికతో కీపర్‌గా అవతారం.. కట్‌చేస్తే.. 1495 మందిని పెవిలియన్ చేర్చి ప్రపంచ రికార్డ్..
Herbert Strudwick
Follow us on

1495 మంది బ్యాటర్లను బాధితులుగా మార్చి.. క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు ఓ ప్లేయర్. ఎన్నో ఏళ్లుగా ఈ సంఖ్య ప్రపంచ రికార్డుగా నమోదైంది. ఇప్పుడు ఈ రికార్డు బద్దలు కావొచ్చు. అయితే ఈ సంఖ్య కంటే ముందు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే ఈ ఫిగర్‌ను చేరుకోగలిగారు. అంటే, నేటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో, వికెట్ కీపర్ చేసిన అత్యధిక ఔట్‌లలో ఈ సంఖ్య మూడవ స్థానంలో ఉంది. ఈ సంఖ్యల ఆధారంగా చరిత్ర పుటల్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ హెర్బర్ట్ స్టర్డ్‌విక్ తన పేరును లిఖించుకున్నాడు. ఈరోజు అతని 143వ జయంతి.

28 జనవరి 1880న సర్రేలో జన్మించిన వికెట్ కీపర్ హెర్బర్ట్ 1910, 1926 మధ్య ఇంగ్లాండ్ తరపున 28 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వికెట్ల వెనుక 61 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు చేశాడు. అయితే అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మాత్రం 1495 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు.

ప్రపంచ రికార్డు..

ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో హెర్బర్ట్ పేరు అత్యధిక ఔట్‌లు చేసిన లిస్టులో మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇది చాలా కాలం పాటు ప్రపంచ రికార్డుగా అలాగే నిలిచింది. కానీ, జాన్ థామస్ ముర్రే 1952, 1975 మధ్య 1527 తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తరువాత, రాబర్ట్ విలియం టేలర్ 1960, 1988 మధ్య 1649 మందిని పెవిలియన్ చేర్చి థామస్ రికార్డును బద్దలు కొట్టాడు. టేలర్ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది.

కెరీర్‌లో ఆమే కీలకం..

హెర్బర్ట్ 1495లో 1237 క్యాచ్‌లు తీసుకుని 258 స్టంపౌట్స్ చేశాడు. అతను 1903లో 71 క్యాచ్‌లు, 20 స్టంపింగ్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే 8 సంవత్సరాల తర్వాత ఫ్రెడ్ ఆఫ్ కెంట్ అతని రికార్డును బద్దలు కొట్టాడు. హెర్బర్ట్ తన వికెట్ కీపింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో భయాందోళనలు సృష్టించాడు. అయితే అతను తన కంటే వయసులో చాలా పెద్దదైన అమ్మాయి కోరిక మేరకు వికెట్ కీపింగ్ ప్రారంభించడం గమనార్హం.

హెర్బర్ట్‌కు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతను కవర్ నుంచి వికెట్‌కి పరిగెత్తడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత నిపుణుడిగా మారాడు. అతని సామర్థ్యాన్ని అతని కంటే వయసులో చాలా పెద్దదైన అమ్మాయి గుర్తించి వికెట్ కీపింగ్ చేయమని సలహా ఇచ్చింది. హెర్బర్ట్ ఆమె మాటలను తప్పించుకోలేకపోయాడు. ఆ సలహా సరైనదని గుర్తించాడు. అదే రోజు నుంచి వికెట్ కీపింగ్ ప్రారంభించాడు.

ఒక సీజన్‌లో 91 మందిని పెవిలియన్ పంపాడు..

ఇంగ్లీష్ వికెట్ కీపర్ 1903లో ఒకే సీజన్‌లో 91 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 1927 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కొనసాగించాడు. హెర్బర్ట్ 1970లో 90 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు.