తొలి సెంచరీ నమోదైంది..!

|

Jun 04, 2019 | 7:38 AM

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచులు దాదాపు వన్ సైడెడ్‌గా జరిగాయి. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌కు కూడా సెంచరీ చేసే అవకాశం రాలేదు. దీంతో అందరూ కూడా భారత్ ఆటగాళ్లు ప్రపంచకప్‌లో తొలి సెంచరీ నమోదు చేస్తారని అభిమానులు ఊహించారు. అయితే నిన్న జరిగిన పాకిస్థాన్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో.. జట్టును గెలిపించే క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అద్భుత సెంచరీ చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన రూట్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. […]

తొలి సెంచరీ నమోదైంది..!
Follow us on

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచులు దాదాపు వన్ సైడెడ్‌గా జరిగాయి. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌కు కూడా సెంచరీ చేసే అవకాశం రాలేదు. దీంతో అందరూ కూడా భారత్ ఆటగాళ్లు ప్రపంచకప్‌లో తొలి సెంచరీ నమోదు చేస్తారని అభిమానులు ఊహించారు. అయితే నిన్న జరిగిన పాకిస్థాన్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో.. జట్టును గెలిపించే క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అద్భుత సెంచరీ చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన రూట్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. 104 బంతుల్లో 107 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. అటు ఇదే మ్యాచ్‌లో మరో ఆటగాడు జోస్ బట్లర్ కూడా చెలరేగి 76 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఇది ఇలా ఉండగా 2015 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ తొలి సెంచరీ చేశాడు. 102 బంతుల్లో ఈ శతకం సాధించాడు.