Sixes Banned: వార్నీ.. ఇదెక్కడి వింత రూల్ భయ్యా.. సిక్స్‌‌లపై నిషేధం.. కొడితే పెవిలియన్‌కే.. ఎందుకో తెలుసా?

|

Jul 24, 2024 | 10:36 AM

Sixes Banned in Cricket Match: ప్రతి క్రికెట్ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం. ప్రేక్షకులు కూడా బౌండరీలనే ఎక్కువగా కోరుకుంటుంటారు. మైదానంలో బౌండరీల వర్షం కురుస్తుంటే, ఫ్యాన్స్ ఉరకలేసే ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇంగ్లండ్‌లోని ఓ క్రికెట్ క్లబ్ సిక్సర్ల విషయంలో షాకింగ్ రూల్ చేసింది. అక్కడ ఒక సిక్సర్ కొడితే, బ్యాట్స్‌మన్ తన వికెట్‌ను కోల్పోయినట్లే లెక్క. నిజానికి, ఇంగ్లండ్‌లోని సౌత్‌విక్, షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లపై ఇలాంటి వింత చర్య తీసుకుంది.

Sixes Banned: వార్నీ.. ఇదెక్కడి వింత రూల్ భయ్యా.. సిక్స్‌‌లపై నిషేధం.. కొడితే పెవిలియన్‌కే.. ఎందుకో తెలుసా?
Sixes Banned
Follow us on

Sixes Banned in Cricket Match: ప్రతి క్రికెట్ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం. ప్రేక్షకులు కూడా బౌండరీలనే ఎక్కువగా కోరుకుంటుంటారు. మైదానంలో బౌండరీల వర్షం కురుస్తుంటే, ఫ్యాన్స్ ఉరకలేసే ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇంగ్లండ్‌లోని ఓ క్రికెట్ క్లబ్ సిక్సర్ల విషయంలో షాకింగ్ రూల్ చేసింది. అక్కడ ఒక సిక్సర్ కొడితే, బ్యాట్స్‌మన్ తన వికెట్‌ను కోల్పోయినట్లే లెక్క. నిజానికి, ఇంగ్లండ్‌లోని సౌత్‌విక్, షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లపై ఇలాంటి వింత చర్య తీసుకుంది.

ఈ నిబంధనను అమలు చేయడానికి కారణం?

సిక్స్‌లపై నిషేధం గురించి వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. కానీ, ఈ నిబంధనను అమలు చేయడానికి కారణం దాని కంటే విచిత్రమైనది. సిక్స్‌ల కారణంగా తమ ఆస్తికి నష్టం వాటిల్లిందని సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఫిర్యాదు చేసినందున క్లబ్ ఈ నిబంధనను రూపొందించింది. ఇది కాకుండా, బంతి కారణంగా ప్రజలు, కారు అద్దాలు దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ వదిలించుకోవడానికి, క్లబ్ ఈ కఠినమైన నియమాలను రూపొందించాల్సి వచ్చింది.

మొదటి సిక్స్‌ కొడితే ఆటగాళ్లకు వార్నింగ్‌ అలెర్ట్..

ఈ నిబంధన ప్రకారం, మ్యాచ్‌లో మొదటి సిక్స్ కొట్టినప్పుడు, ప్రతి ఆటగాడికి ఒకసారి వార్నింగ్ ఇస్తారు. ఆ జట్టు 6 పరుగులను కూడా పొందదు. అదే సమయంలో, రెండవ సిక్స్ కొట్టిన తర్వాత, ఆ ఆటగాడు ఔట్‌గా ప్రకటిస్తారు. పెవిలియన్‌కు తిరిగి వెళ్లవలసి ఉంటుంది. ఈ విషయమై సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ కోశాధికారి మార్క్ బ్రోక్సప్ పూర్తి వివరాలను తెలిపారు. అతని ప్రకారం, భీమా క్లెయిమ్‌లు, చట్టపరమైన చర్యల కారణంగా ఖర్చులను నివారించడానికి ఈ నియమాన్ని రూపొందించాలని నిర్ణయించారు.

నిబంధనలకు వ్యతిరేకంగా ఆటగాళ్లు ఆందోళనలు..

ఈ నియమానికి సంబంధించి, ‘పాత కాలంలో ఈగేమ్ ప్రశాంత వాతావరణంగా ఆడేవారు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోకి వచ్చిన తర్వాత ఈ గేమ్‌లో మరింత దూకుడు కనిపించడం మొదలైందని స్థానికులు అంటున్నారు. అదే సమయంలో, స్టేడియం సమీపంలో నివసిస్తున్న 80 ఏళ్ల వ్యక్తి ప్రకారం, నేటి ఆటగాళ్లు మరింత దూకుడుగా మారారు. వారికి సిక్సర్ కొట్టడానికి స్టేడియం కూడా చాలా చిన్నదైపోతోందంటూ చెబుతున్నారు. అదే సమయంలో, క్లబ్ ఈ నిబంధనపై చాలా మంది ఆటగాళ్ళు కూడా తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..