Video: విజయానికి 12 బంతుల్లో 61 పరుగులు.. రిజల్ట్ మీరు అస్సలు ఊహించలేరంతే.. ఎక్కడో తెలుసా?

|

Jul 16, 2024 | 7:41 PM

ECI T10 Romania: ఆస్ట్రియా విజయానికి చివరి 2 ఓవర్లలో 61 పరుగులు కావాలి. ఆస్ట్రియా జట్టు ఎనిమిదో ఓవర్ వరకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ, తొమ్మిదో ఓవర్లో ఆస్ట్రియా కెప్టెన్ అకిబ్ ఇక్బాల్ 41 పరుగులు చేశాడు. ఇందులో వైడ్ బాల్ బౌండరీ, నో బాల్‌లో రెండు సిక్సర్లు ఇలా పరుగుల వర్షం కురిసింది.

Video: విజయానికి 12 బంతుల్లో 61 పరుగులు.. రిజల్ట్ మీరు అస్సలు ఊహించలేరంతే.. ఎక్కడో తెలుసా?
Eci T10 Romania Vs Austria
Follow us on

ECI T10 Romania vs Austria: క్రికెట్ మైదానంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అద్భుతం జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు బ్యాట్స్‌మెన్స్ తమ తుఫాన్ బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటే.. మరోవైపు బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఘటనే జరగడంతో ఆస్ట్రియా జట్టు 61 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11 బంతుల్లోనే ఛేదించి ఉత్కంఠ విజయం సాధించింది. చివరి దశ వరకు విజయం చేతిలోనే ఉన్న రొమేనియా జట్టు.. చివరి రెండు ఓవర్లలో బౌలర్ల పేలవమైన బౌలింగ్ కారణంగా ఓటమి మూల్యం చెల్లించుకుంది.

రొమేనియా బ్యాటింగ్ అద్భుతం..

నిజానికి యూరోపియన్ క్రికెట్‌లో ఆస్ట్రియా, రొమేనియా మధ్య మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఈసీఐ రొమేనియా టీ10 లీగ్ మ్యాచ్‌లో రొమేనియా దూకుడుగా బ్యాటింగ్ చేసి 167 పరుగులు చేసింది. రొమేనియా బ్యాట్స్‌మెన్ అరియన్ మహ్మద్ 39 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 104 పరుగులు చేయగా, మహ్మద్ మోయిస్ 14 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు చేశాడు.

ఇక్బాల్ తుఫాన్ బ్యాటింగ్..

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆస్ట్రియా జట్టుకు ఈ ఛేజింగ్ దాదాపు అసాధ్యం. అప్పటికే ఆ జట్టు టాప్‌ మూడు వికెట్లు పడిపోయాయి. చివరి 2 ఓవర్లలో విజయానికి 61 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రియా జట్టు ఎనిమిదో ఓవర్ వరకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ, తొమ్మిదో ఓవర్లో ఆస్ట్రియా కెప్టెన్ అకిబ్ ఇక్బాల్ 41 పరుగులు చేశాడు. ఇందులో వైడ్ బాల్ బౌండరీ, నో బాల్‌లో రెండు సిక్సర్లు ఇలా పరుగుల వర్షం కురిసింది.

19 బంతుల్లో 72 పరుగులు..

ఆఖరి ఓవర్లో ఇమ్రాన్ ఆసిఫ్ సిక్సర్ కొట్టగా, అకిబ్ స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత అకిబ్ వరుసగా 3 సిక్సర్లు బాది జట్టుకు కేవలం 9.5 ఓవర్లలోనే అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో అకిబ్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. ఇమ్రాన్ ఆసిఫ్ కూడా 12 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సర్లతో అజేయంగా 22 పరుగులు చేశాడు. దీంతో పాటు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రియా ఈసీఐ రొమేనియా టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..