ముంబైతో తలపడేదెవరో..?

|

May 10, 2019 | 1:19 PM

ఐపీఎల్ 12వ సీజన్ ఆఖరి అంకంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మొదటిసారి ఫైనల్‌లో అడుగు పెట్టాలని తహతహలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మూడుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. సాగర తీరం సాక్షిగా ఎంతో అనుభవం ఉన్న చెన్నై గెలుస్తుందా.. లేక కుర్రాళ్ళతో ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ‌ పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.? అపార అనుభవం చెన్నై సొంతం… ఇప్పటివరకు చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం.. మూడుసార్లు ఛాంపియన్ కావడం చెన్నై […]

ముంబైతో తలపడేదెవరో..?
Follow us on

ఐపీఎల్ 12వ సీజన్ ఆఖరి అంకంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మొదటిసారి ఫైనల్‌లో అడుగు పెట్టాలని తహతహలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మూడుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. సాగర తీరం సాక్షిగా ఎంతో అనుభవం ఉన్న చెన్నై గెలుస్తుందా.. లేక కుర్రాళ్ళతో ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ‌ పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.?

అపార అనుభవం చెన్నై సొంతం…

ఇప్పటివరకు చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం.. మూడుసార్లు ఛాంపియన్ కావడం చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసొచ్చే అంశం. అయితే క్వాలిఫైయర్ 1లో ముంబై చేతిలో ఓడిన ఆ జట్టు తన బ్యాట్స్‌మెన్ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. ముంబైపై కేవలం 131 పరుగులు మాత్రమే చేసిన చెన్నై.. ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచాలని చూస్తోంది. ధోని ఫామ్‌ చెన్నైకి  లాభించదగ్గ అంశమే కానీ… వాట్సన్‌తో పాటు డుప్లెసిస్‌, రాయుడు, రైనా కూడా తోడైతే చెన్నై బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెన్నైకి పెద్ద సమస్యలు ఏమి లేవు. టోర్నీ ఆరంభం నుంచి బౌలింగే చెన్నైకి గొప్ప బలం. తాహిర్‌, హర్భజన్‌, జడేజాలతో కూడిన నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌ ఆ జట్టు సొంతం. అంతేకాకుండా పేసర్ దీపక్ చాహర్ నిలకడగా రాణిస్తుండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. సో ఇలాంటి బౌలింగ్ లైన్ అప్‌ను ఎదుర్కోవాలంటే ఢిల్లీ కష్టపడాల్సిందే..!

కుర్రాళ్ళ జోరు.. ఢిల్లీ హుషారు.!

ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ను ఓడించిన ఢిల్లీ జట్టు ఫుల్ జోష్‌తో ఈ పోరుకు సిద్ధమైంది. యువ క్రికెటర్ రిషబ్ పంత్ మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి పెద్ద సానుకూలాంశం. పంత్‌తో పాటు పృథ్వీ షా కూడా పరుగుల బాట పట్టడం, శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సంతోషాన్నిచ్చే విషయాలే. వీళ్ళకి తోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణించడం, హార్డ్ హిట్టర్స్ మున్రో, ఇంగ్రామ్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేకాకుండా విశాఖలో ఇప్పటికే మ్యాచ్‌ ఆడి ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కాగా ఆ జట్టు పేస్ బౌలర్ కాగిసో రబడా గైర్హాజరీలో ట్రెంట్‌ బౌల్ట్‌, ఇషాంత్‌ శర్మ, కీమో పాల్‌, అమిత్‌ మిశ్రా చక్కటి ప్రదర్శన కనబరుస్తూ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరందరూ మరోసారి మాయ చేస్తే ఢిల్లీ ఫైనల్స్‌కు చేరడం ఖాయమే.!