Bipul Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిపుల్ శర్మ.. అమెరికాలోఆడేందుకు నిర్ణయం..

|

Dec 27, 2021 | 7:17 AM

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిపుల్ శర్మ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికాలో క్రికెట్ ఆడేందుకు బిపుల్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Bipul Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిపుల్ శర్మ.. అమెరికాలోఆడేందుకు నిర్ణయం..
Bipul Sharma
Follow us on

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిపుల్ శర్మ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికాలో క్రికెట్ ఆడేందుకు బిపుల్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిపుల్ శర్మ కంటే ముందు, ఉన్ముక్త్ చంద్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ఆల్ రౌండర్ కూడా అమెరికన్ లీగ్‌లో ఆడబోతున్నాడు.

ఐపీఎల్‌లో బిపుల్ శర్మ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడారు. 2016లో ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో బిపుల్ శర్మ కూడా సభ్యుడు. ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవడంలో బిపుల్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఏబీ డివిలియర్స్‌ వికెట్‌ తీసిన బిపుల్‌.. చివరికి హైదరాబాద్‌ 8 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది.

బిపుల్ శర్మ పంజాబ్, హిమాచల్, సిక్కిం తరఫున కూడా రంజీ ట్రోఫీ ఆడారు. భారత క్రికెట్‌లో బిపుల్ శర్మ 5835 పరుగులతో పాటు అతని పేరు మీద 306 వికెట్లు తీశాడు. బిపుల్ శర్మ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 8 సెంచరీలు సాధించాడు. అదే సమయంలో భారత A జట్టలో ఉండగా ఒక సెంచరీని చేశాడు.

Read Also.. IND vs SA: సెంచూరియన్ కీలక ఇన్నింగ్స్‌కు ఆయనే కారణం.. బ్యాటింగ్ రహస్యాలపై భారత ఓపెనర్ కీలక వ్యాఖ్యలు..!