
టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. తన పేరును అనయగా మార్చుకున్నాడు . అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ నిర్వహిస్తున్న ‘రైజ్ అండ్ ఫాల్’ షోలో తను సంచలన విషయాన్ని వెల్లడించింది. తనకు ఓ క్రికెటర్ నగ్న ఫోటో పంపినట్లు తెలిపింది. నేను నవంబర్‌లో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి బహిరంగంగా బయటకు వచ్చాను. డిసెంబర్-జనవరి నాటికి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాను.
నా మనసులో ఏముందో దాన్ని పోస్ట్ చేస్తున్నాను. ఒక క్రికెటర్ నాతో మాట్లాడటం ప్రారంభించాడు అని అనయ అన్నారు. అతను ఆ రకమైన ఫోటోను డైరెక్ట్‌గా పంపించాడు అని అనయ చెప్పింది. ‘ఏ రకమైన ఫోటో? నగ్న ఫోటో?’ అని ఆ షోలో పాల్గొన్న మరో వ్యక్తి అడిగాడు. దీనికి అనయ ‘అర్థం చేసుకోండి’ అని చెప్పింది. మరొక వ్యక్తి ‘ఆ క్రికెటర్ అందరికీ తెలుసా?’ అని అడిగినప్పుడు అనయ ‘అందరికీ అతన్ని తెలుసు’ అని చెప్పింది. ఇది విని అందరూ షాక్ అయ్యారు. అనయకు నగ్న ఫోటో పంపిన క్రికెటర్ ఎవరు అనేది ఇప్పడు అందరినీ వేధించే ప్రశ్నగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి