రహానెకే మళ్ళీ జట్టు పగ్గాలు..!

|

May 04, 2019 | 1:10 PM

రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం మళ్ళీ అజింక్య రహానెకే సారధ్య బాధ్యతలు అప్పగించారు. సీజన్ ప్రారంభం నుంచి మధ్యవరకు రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు రహానె. కానీ జట్టు వరుస వైఫల్యాల వల్ల యాజమాన్యం రహానెను కాదని స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అప్పగించారు. వరుస విజయాలు అందించిన ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.. ప్రపంచకప్ సన్నద్ధత కోసం స్వదేశానికి వెళ్లిపోవడంతో మళ్ళీ రహానెకే బాధ్యతలను అప్పగిస్తూ రాయల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ‘‘నాయకత్వ బాధ్యతలు అందుకోవాలని రహానెను కోరాం. […]

రహానెకే మళ్ళీ జట్టు పగ్గాలు..!
Follow us on

రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం మళ్ళీ అజింక్య రహానెకే సారధ్య బాధ్యతలు అప్పగించారు. సీజన్ ప్రారంభం నుంచి మధ్యవరకు రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు రహానె. కానీ జట్టు వరుస వైఫల్యాల వల్ల యాజమాన్యం రహానెను కాదని స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అప్పగించారు. వరుస విజయాలు అందించిన ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.. ప్రపంచకప్ సన్నద్ధత కోసం స్వదేశానికి వెళ్లిపోవడంతో మళ్ళీ రహానెకే బాధ్యతలను అప్పగిస్తూ రాయల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ‘‘నాయకత్వ బాధ్యతలు అందుకోవాలని రహానెను కోరాం. అతను కేవలం బ్యాటింగ్‌ మీదే దృష్టిపెట్టడం కోసం నాకీ బాధ్యత వద్దని సులభంగా తప్పించుకోవచ్చు. కానీ ధైర్యంగా, హుందాగా మళ్లీ కెప్టెన్సీ చేపట్టడానికి అంగీకరించాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆటగాడు మా జట్టులో ఉన్నందుకు గర్విస్తున్నాం’’ అని రాయల్స్ హెడ్ కోచ్ ప్యాడి ఉప్ట్‌న్ తెలిపాడు.