క్రిస్ గేల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు..!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:53 PM

వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్… అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మట్స్ లో 481 సిక్స్ లు బాదిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. చాలా రోజుల తర్వాత టీంలో చోటు దక్కించుకున్న క్రిస్ గేల్.. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటించిన గేల్ ఈ మ్యాచ్ లో 135 పరుగులు చేశాడు. దీనిలో 12 సిక్స్ […]

క్రిస్ గేల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు..!
Follow us on

వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్… అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మట్స్ లో 481 సిక్స్ లు బాదిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. చాలా రోజుల తర్వాత టీంలో చోటు దక్కించుకున్న క్రిస్ గేల్.. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటించిన గేల్ ఈ మ్యాచ్ లో 135 పరుగులు చేశాడు. దీనిలో 12 సిక్స్ లు, మూడు ఫోర్స్ ఉన్నాయి.      

గేల్ తర్వాత అత్యధిక సిక్స్ లు కొట్టిన రెండో ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది (476) కాగా, బ్రెండన్ మెకల్లమ్ (398) మూడవ స్థానంలో ఉన్నాడు. ఇకపోతే ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో గేల్ తో పాటు హోప్, డారెన్ బ్రావో చెలరేగగా విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 రన్స్ చేసింది.

భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన ఇంగ్లాండ్.. రికార్డు విజయం సొంతం చేసుకుంది. వారి బ్యాట్స్ మెన్స్ జాసన్ రాయ్(123), జో రూట్ (102) ఆరు వికెట్స్ తేడాతో మరో 8 బంతులు ఉండగానే విజయం అందించారు.