వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్ గేల్

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:53 PM

వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ త్వరలోనే అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఐసీసీ వరల్డ్ కప్ అనంతరం క్రిస్ గేల్ వన్డేలకు రిటైర్ అవుతున్నాడని వెస్టిండీస్ బోర్డు ట్వీట్ చేసింది. యూనివర్స్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే క్రిస్ గేల్ కి చాలాకాలం తర్వాత ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత తను రిటైర్ అవుతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో గేల్ […]

వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్ గేల్
Follow us on

వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ త్వరలోనే అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఐసీసీ వరల్డ్ కప్ అనంతరం క్రిస్ గేల్ వన్డేలకు రిటైర్ అవుతున్నాడని వెస్టిండీస్ బోర్డు ట్వీట్ చేసింది.

యూనివర్స్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే క్రిస్ గేల్ కి చాలాకాలం తర్వాత ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత తను రిటైర్ అవుతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో గేల్ స్పష్టం చేశాడు. 1999 లో వన్డేలలో అరంగ్రేటం చేసిన క్రిస్ గేల్ తన కెరీర్ లో 284 వన్డేలు ఆడాడు. ఇందులో 23 సెంచరీలు, 49 అర్ధ శతకాలు సాధించిన గేల్ 9,727 పరుగులు చేశాడు. విండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా(10,405) తర్వాత వన్డేలలో వెస్టిండీస్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు క్రిస్ గేల్.

రిటైర్మెంట్ గురించి గేల్ మాట్లాడుతూ ‘ వరల్డ్ కప్ తో నా వన్డే క్రికెట్ ముగుస్తుంది. యువ క్రికెటర్లకు గైడ్ గా ఉంటూ.. వారి ఆటను ఎంజాయ్ చేస్తాను’ అని పేర్కొన్నాడు.