పుజారా సంచలనం.. టీ20ల్లో సరికొత్త రికార్డ్

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:54 PM

గత కొద్దికాలంగా క్రికెటర్ ఛతేశ్వర పుజారా టెస్టులలో రాణిస్తూ భారత్ కు అపురూపమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనను ‘ది వాల్’ అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు. ఇది ఇలా ఉంటే పుజారా టెస్టులకు తప్ప వన్డేలు, టీ20లకు పనికిరాదని కొందరి వాదన. ఇప్పుడు వారందరిని షాక్ కి గురి చేస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు పుజారా.   సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ లో సౌరాష్ట్ర జట్టు తరుపున ఆడుతున్న పుజారా […]

పుజారా సంచలనం.. టీ20ల్లో సరికొత్త రికార్డ్
Follow us on

గత కొద్దికాలంగా క్రికెటర్ ఛతేశ్వర పుజారా టెస్టులలో రాణిస్తూ భారత్ కు అపురూపమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనను ‘ది వాల్’ అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు. ఇది ఇలా ఉంటే పుజారా టెస్టులకు తప్ప వన్డేలు, టీ20లకు పనికిరాదని కొందరి వాదన. ఇప్పుడు వారందరిని షాక్ కి గురి చేస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు పుజారా.  

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ లో సౌరాష్ట్ర జట్టు తరుపున ఆడుతున్న పుజారా రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 61 బంతుల్లో ఒక సిక్స్, 14 ఫోర్స్ తో సెంచరీ చేసి.. టోర్నమెంట్ లో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో సౌరాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది.

అయితే పుజారా సెంచరీ వృధా చేస్తూ రైల్వేస్ 189 పరుగుల లక్షాన్ని 19.4 ఓవర్లలోనే పూర్తి చేసి విజయం సాధించింది.