ఆ రికార్డుని గేల్ సాధిస్తాడా?

| Edited By:

Aug 11, 2019 | 4:01 PM

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగబోయే రెండో వన్డే.. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌కు ఎంతో ప్రత్యేకం. గేల్‌ విండీస్‌ తరఫున 300వ వన్డే ఆడనున్న తొలి క్రికెటర్‌. కరీబియన్‌ జట్టు మాజీ సారథి బ్రియాన్‌ లారా 295 వన్డేలు ఆడాక 2007లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇప్పటికే గేల్‌ ఆ రికార్డును అధిగమించి 299 వన్డే మ్యాచ్‌లు అడాడు. ఈ క్రమంలో భారత్‌తో ఈ రోజు తలపడే మ్యాచ్‌ అతడికి ప్రత్యేకం కానుంది. ఈ సిరీస్‌ […]

ఆ రికార్డుని గేల్ సాధిస్తాడా?
Follow us on

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగబోయే రెండో వన్డే.. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌కు ఎంతో ప్రత్యేకం. గేల్‌ విండీస్‌ తరఫున 300వ వన్డే ఆడనున్న తొలి క్రికెటర్‌. కరీబియన్‌ జట్టు మాజీ సారథి బ్రియాన్‌ లారా 295 వన్డేలు ఆడాక 2007లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇప్పటికే గేల్‌ ఆ రికార్డును అధిగమించి 299 వన్డే మ్యాచ్‌లు అడాడు. ఈ క్రమంలో భారత్‌తో ఈ రోజు తలపడే మ్యాచ్‌ అతడికి ప్రత్యేకం కానుంది. ఈ సిరీస్‌ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశమున్నందున రెండో వన్డేలో చెలరేగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అలాగే వన్డేల్లో ప్రస్తుతం 10,397 పరుగులు చేసిన గేల్‌ మరో తొమ్మిది పరుగులు చేస్తే విండీస్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు లారా 295 మ్యాచ్‌ల్లో 10,405 పరుగులు చేసి అతడికన్నా ముందున్నాడు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో చెలరేగితే అరుదైన రికార్డు అందుకోనున్నాడు. కాగా తొలి వన్డేలోనూ ఈ విధ్వంసకర ఓపెనర్‌ చెలరేగుతాడని అభిమానులు ఆశించినా భారత బౌలర్లు అతడికి అడ్డుకట్ట వేశారు. 31 బంతులాడి కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు.