ఇకపై ఒకటే పదవి..తేల్చుకోండి మాజీలు!

|

Jun 22, 2019 | 6:44 AM

ముంబయి: భారత్ మాజీ స్టార్ ప్లేయర్లకు ఇప్పుడు సందిగ్దంలో ఉన్నారు.ఎందుకంటే క్రికెట్‌కు సంబంధించి ఏదో ఒక పదవిని మాత్రమే ఎంచుకోవాల్సిన డోలాయమాన పరిస్థితి నెలకొంది. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, నైతిక నియమావళి అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ బోర్డు రాజ్యంగం ప్రకారం ఏదో ఒక పదవికే పరిమితం కావాలని ఆదేశించడమే ఇందుకు కారణం. గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌ లాంటి క్రికెటర్లు అటు బీసీసీఐలో గౌరవప్రదమైన పదవుల్లో ఉంటూ..ఇటూ ఐపీఎల్‌లోనూ జట్లకు మెంటర్స్, కోచ్‌, కామెంటేటర్స్ లాంటి పదవుల్లో ఉంటూ […]

ఇకపై ఒకటే పదవి..తేల్చుకోండి మాజీలు!
Follow us on

ముంబయి: భారత్ మాజీ స్టార్ ప్లేయర్లకు ఇప్పుడు సందిగ్దంలో ఉన్నారు.ఎందుకంటే క్రికెట్‌కు సంబంధించి ఏదో ఒక పదవిని మాత్రమే ఎంచుకోవాల్సిన డోలాయమాన పరిస్థితి నెలకొంది. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, నైతిక నియమావళి అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ బోర్డు రాజ్యంగం ప్రకారం ఏదో ఒక పదవికే పరిమితం కావాలని ఆదేశించడమే ఇందుకు కారణం. గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌ లాంటి క్రికెటర్లు అటు బీసీసీఐలో గౌరవప్రదమైన పదవుల్లో ఉంటూ..ఇటూ ఐపీఎల్‌లోనూ జట్లకు మెంటర్స్, కోచ్‌, కామెంటేటర్స్ లాంటి పదవుల్లో ఉంటూ విరుద్ద ప్రయోజనాలు పొందుతోన్నారని..మధ్యప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్‌లో మాజీ సభ్యుడైన సంజీవ్ గుప్తా బీసీసీఐకి అప్పీల్ చేశారు. దీంతో  పై విధంగా బోర్టు తీర్పు వెలువరించిందిి. ఈ నేపథ్యంతో వారిని ఏదో ఒక పదవి మాత్రమే ఎంచుకోవాలని బీసీసీఐ కోరిందని సమాచారం.

క్రికెట్‌ సలహా కమిటీ సభ్యులైన ఈ ముగ్గురూ ప్రస్తుతం ప్రపంచకప్‌లో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. సునిల్‌ గవాస్కర్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లే, సంజయ్‌ మంజ్రేకర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు ప్రపంచకప్‌లో కామెంటరీ చేస్తున్నారు. వీరిలో చాలామంది ఐపీఎల్‌ జట్లు, క్రికెట్‌ పాలన, కోచింగ్‌, కామెంటరీ విభాగాల్లో వేర్వేరు పాత్రలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒకదానికే పరిమితం కావాల్సి ఉంటుంది.