మహిళా క్రికెటర్ల ప్రేమాయణం.. పెళ్లితో సరి
వారిద్దరు వేరు వేరు దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లు. ప్లే గ్రౌండ్లో ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరి మధ్య గ్రౌండ్ బయట స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త కాలక్రమంలో ప్రేమగా మారింది. ఆ ప్రేమను కలకాలం కొనసాగించాలనుకున్న వారు మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సెన్, ఆసీస్ మహిళా క్రికెటర్ నికోలా హన్‌కాక్ మధ్య ఎలా ఏర్పడిందో గానీ.. స్నేహం మొదలై అది పెళ్లికి దారితీసింది. గతవారంలోనే వీరిద్దరి పెళ్లి జరగగా.. […]
వారిద్దరు వేరు వేరు దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లు. ప్లే గ్రౌండ్లో ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరి మధ్య గ్రౌండ్ బయట స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త కాలక్రమంలో ప్రేమగా మారింది. ఆ ప్రేమను కలకాలం కొనసాగించాలనుకున్న వారు మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సెన్, ఆసీస్ మహిళా క్రికెటర్ నికోలా హన్‌కాక్ మధ్య ఎలా ఏర్పడిందో గానీ.. స్నేహం మొదలై అది పెళ్లికి దారితీసింది. గతవారంలోనే వీరిద్దరి పెళ్లి జరగగా.. ఈ విషయాన్ని తాజాగా వారు ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. స్వలింగ సంపర్క వివాహాలు న్యూజిలాండ్‌లో చట్టబద్ధం కావడంతో వీరి వివాహానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు.
కాగా కివీస్ ఆల్‌రౌండర్ అయిన జెన్సన్ బిగ్‌బాష్ లీగ్‌లోని తొలి రెండు సీజన్లలో ‘మెల్బోర్న్ స్టార్స్’కు ప్రాతినిధ్యం వహించింది. మూడో ఎడిషన్‌లో మెల్బోర్న్ రెనెగడెస్‌కు మారింది. ఇక, నికోల్ హన్‌కాక్ ‘టీం గ్రీన్’కు ప్రాతినిధ్యం వహిస్తోంది.
అయితే మహిళా క్రికెట్ ప్రపంచంలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం కొత్తేం కాదు. గతేడాది దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వ్యాన్ నీకెర్క్.. తన సహచరి అయిన మారిజానే కేప్‌ను పెళ్లాడింది. అలాగే అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఒకే జట్టుకు చెందిన శాటెర్త్‌వైట్-లీ తహహు.. వ్యాన్ నీకెర్క్-కేప్‌లు కూడా వివాహాలు చేసుకున్నారు.