ఐపీఎల్ 2020: ఆసీస్, విండీస్ ప్లేయర్ల హవా.. ఫైనల్ లిస్ట్ ఇదే!

|

Dec 20, 2019 | 1:28 PM

ఐపీఎల్ 2020 మొదటి రోజు ఆక్షన్ ముగిసింది. 32 అంతర్జాతీయ ప్లేయర్లు.. 30 యువ క్రికెటర్లు వెరసి మొత్తంగా 62 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ వేలంలో ఆసీస్, విండీస్ ప్లేయర్ల హవా సాగింది. ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్(15.50 కోట్లు)  ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది వేలంలో అతడ్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధికంగా 11 మందిని తీసుకుంది. కోల్‌కతా, పంజాబ్‌లు […]

ఐపీఎల్ 2020: ఆసీస్, విండీస్ ప్లేయర్ల హవా.. ఫైనల్ లిస్ట్ ఇదే!
Follow us on

ఐపీఎల్ 2020 మొదటి రోజు ఆక్షన్ ముగిసింది. 32 అంతర్జాతీయ ప్లేయర్లు.. 30 యువ క్రికెటర్లు వెరసి మొత్తంగా 62 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ వేలంలో ఆసీస్, విండీస్ ప్లేయర్ల హవా సాగింది. ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్(15.50 కోట్లు)  ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది వేలంలో అతడ్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధికంగా 11 మందిని తీసుకుంది. కోల్‌కతా, పంజాబ్‌లు 9 మందిని.. ఢిల్లీ 8.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ చెరో ఏడుగురిని.. చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేసింది.

ఫ్రాంచైజీల వారీగా లిస్ట్ ఇలా ఉంది…

చెన్నై సూపర్‌ కింగ్స్‌: సామ్‌ కరన్‌, పీయుష్‌ చావ్లా, జాష్‌ హేజిల్‌వుడ్‌, సాయి కిషోర్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌: జేసన్‌ రాయ్‌, క్రిస్‌ వోక్స్‌, అలెక్స్‌ క్యారీ, షిమ్రన్‌ హెట్‌మయర్‌, మోహిత్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, మార్కస్‌ స్టొయినిస్‌, లలిత్‌ యాదవ్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: ఇయాన్‌ మోర్గాన్‌, పాట్‌ కమిన్స్‌, రాహుల్‌ త్రిపాఠి, వరుణ్‌ చక్రవర్తి, సిద్ధార్థ్‌, క్రిస్‌ గ్రీన్‌, టామ్‌ బాంటన్‌, ప్రవీణ్‌ తంబీ, నిఖిల్‌ నాయక్‌

కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌: గ్లెన్‌ మాక్స్‌వెల్‌, షెల్డన్‌ కాట్రెల్‌, దీపక్‌ హూడా, ఇషాన్‌ పొరెల్‌, రవి బిష్ణోయ్‌, జేమ్స్‌ నీషమ్‌, క్రిస్‌ జోర్డాన్‌, తజిందర్‌ దిల్లాన్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌

ముంబయి ఇండియన్స్‌: క్రిస్‌ లిన్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, సౌరభ్‌ తివారి, మోసిన్‌ ఖాన్‌, దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌, ప్రిన్స్‌ బల్వంత్‌ రాయ్‌ సింగ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు: ఆరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌, జాషువా ఫిలిప్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, పవన్‌ దేశ్‌పాండే, డేల్‌ స్టెయిన్‌, షష్‌బాజ్‌ అహ్మద్‌, ఇసురు ఉడన

రాజస్థాన్‌ రాయల్స్‌: రాబిన్‌ ఉతప్ప, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, యశస్వి జైశ్వాల్‌, అనూజ్‌ రావత్‌, కార్తిక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఒషానె థామస్‌, అనిరుధ్‌ జోషి, ఆండ్రూ టై, టామ్‌ కరన్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: విరాట్‌ సింగ్‌, ప్రియమ్‌ గార్గ్‌, మిచెల్‌ మార్ష్‌, ఫాబియన్‌ అలెన్‌, అబ్దుల్‌ సమద్‌, సంజయ్‌ యాదవ్‌, సందీప్‌ బవనక