ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మళ్లీ అనిల్ కుంబ్లేనే..

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:09 PM

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు కుంబ్లే ఈ పదవిలో కొనసాగుతారు. క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కుంబ్లేను పునర్నియమిస్తూ ఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దుబాయ్ లో ఆరు రోజుల పాటు ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టులో లెగ్ స్పిన్‌ మాంత్రికుడిగా అనిల్ కుంబ్లేకు పేరుంది. తొలిసారి 2012లో వెస్టిండీస్‌ మాజీ […]

ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మళ్లీ అనిల్ కుంబ్లేనే..
Follow us on

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు కుంబ్లే ఈ పదవిలో కొనసాగుతారు. క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కుంబ్లేను పునర్నియమిస్తూ ఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దుబాయ్ లో ఆరు రోజుల పాటు ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టులో లెగ్ స్పిన్‌ మాంత్రికుడిగా అనిల్ కుంబ్లేకు పేరుంది. తొలిసారి 2012లో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌ నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. దుబాయ్‌లో ఆరు రోజుల పాటు జరిగిన ఐసీసీ సమావేశాల్లో కుంబ్లే ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2012లో తొలిసారిగా ఆయన ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌ నుంచి బాధ్యతలను తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో 18ఏళ్ల పాటు భారత లెగ్‌స్పిన్నర్‌ గా సేవలంధించారు. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. అలాగే 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో ఆటగాడు కుంబ్లేనే కావడం విశేషం.